AP Minister: మంత్రి దగ్గర ఉద్యోగం చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఏపీలోని ఓ మంత్రి వద్ద ఉద్యోగం చేయాలంటే మాత్రం చాలా మంది హడలిపోతున్నారు. ఆయన తీరు కారణంగానే ఆయన వద్ద ఉద్యోగం చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని టాక్. ఆయన వద్ద పనిచేసే పీఏ, పీఆర్వోలు ఎప్పటికప్పుడు మారిపోతున్నారట. కొత్త వారు ఆయన వద్ద పనిచేసేందుకు వెళ్తుంటే వద్దని సైతం సలహాలు ఇస్తున్నారని సమాచారం.

మరి ఆ మంత్రి ఏం చేస్తున్నాడు. ఆయన దగ్గర పనిచేసేందుకు ఎందుకు వెనకాడుతున్నారో తెలియట్లే. ప్రస్తుతం ఏ మంత్రికైనా పీఆర్వో చాలా ఇంపార్టెంట్. ఓ మంత్రి వద్ద పీఆర్వోలాగా పనిచేయాలంటే ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. మంత్రి ప్రెస్ మీట్స్, టూర్లకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించాలి. సదురు మంత్రికి ఎవరైనా వ్యతిరేక వార్తలు రాస్తే వాటిని ఖండించాలి. ఇక ఎప్పటికప్పుడు మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటం, అందుకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం లాంటివి చేయాలి. ఆయన మాట్లాడే టైంలో మంత్రికి స్క్రిప్ట్ సైతం రాసివ్వాలి. ఇన్ని బాధ్యతలతో పీఆర్వో పని చేయాల్సి ఉంటుంది. కానీ ఆ మంత్రి దగ్గర ఇప్పటికే ఓ పీఏ, ముగ్గురు పీఆర్వోలు మానేసిటనట్టు తెలుస్తోంది.
Also Read: ఏపీకి మరో ఉపద్రవం.. పుట్టుకొచ్చిన కొత్త పురుగు..
మంత్రి గురించి తెలియక గతంలో ఓ వ్యక్తి పీఆర్వోగా మంత్రి వద్ద ఉద్యోగంలో చేరాడు. ఉన్న ఉద్యోగాన్ని సైతం మానుకున్నాడు. ఇక ఉద్యోగంలో చేరిన తర్వాత అనుకున్నది ఒకటి, అయినది ఒకటిగాలా మారింది ఆ పీఆర్వో పరిస్థితి. ఇస్తామన్న దాంట్లో సగం కూడా జీతం ఇవ్వలేదు. టీడీ, డీఏలు సైతం దిక్కు లేకుండా పోయాయి.
సెక్రటేరియట్‌కు.. మంత్రి సొంత జిల్లాకు తిరగడమే సరిపోతుంది. అతనికి అకామినేషన్ సైతం లేదు. ఏమైనా అంటే లాడ్జీలో ఉండాలని మంత్రి నుంచి సమాధానం వస్తుందట. ఇలా ఖర్చులు పెరిగిపోవడం, జీతం తక్కువ రావడంతో అతడు ఆశ్చర్య పోయాడు. మరో పీఆర్వో సైతం ఇలాగే ఉత్సాహంగా విధుల్లో చేరి ఆరునెలల్లోనే తప్పుకున్నాడు. వీరి కంటే ముందుగా మంత్రి దగ్గర పని చేసిన పీఆర్వో సైతం ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు.
Also Read: ఏపీలో దొంగలు పడ్డారు?