Afghanistan, Operation Promise Kept: అమెరికా సైన్యం(US forces) ఇచ్చిన మాట తప్పలేదు. తమకు విధేయుడిగా ఉన్న అధికారిని రక్షించి తమలో మానవత్వం ఉందని నిరూపించుకున్నాయి. తాలిబన్ల (Taliban) కళ్లు గప్పి సురక్షిత ప్రాంతానికి తరలించడంలో సఫలీకృతమైంది. ఆపరేషన్ ప్రామిస్ కెప్ట్ (Operation Promise Kept) పేరుతో బుధవారం పోలీస్ అధికారితో పాటు ఆయన కుటుంబసభ్యులను హెలికాప్టర్ లో కాబుల్ నుంచి సురక్షిత ప్రాతానికి తరలించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను విజయవతంగా నిర్వహించి తన బాధ్యతను నిరూపించుకుంది.
మహమ్మద్ ఖాలిద్ వర్దక్ అఫ్గాన్ లో అమెరికా సైనికులతో కలిసి పనిచేశారు. శత్రువులు విసిరిన గ్రెనేడ్ దాడిలో కాలు పోగొట్టుకున్నాడు. అమెరికా సాయంతో కృత్రిమ కాలు అమర్చుకుని తిరిగి విధుల్లో చేరి తన బాధ్యతలు పోషించాడు. ఈ నేపథ్యంలో తాలిబన్లు అఫ్గాన్ ను ఆక్రమించుకోవడంతో పరిస్థితి తారుమారైంది. అతడిని చంపేందుకు తాలిబన్లు అంతటా వెతుకుతున్నారు. దీంతో కుటుంబంతో సహా తాను దేశం విడిచిపోవడానికి పలుమార్లు స్థావరం మార్చారు.
అయితే ఇంతలో తనలో కలిసి పనిచేసిన అమెరికా సైనికులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ అడుగడుగునా తాలిబన్లు మోహరించడంతో వారి కళ్లు గప్పి తప్పించుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. నాలుగు స్థావరాలు మార్చి ఎట్టకేలకు తప్పించుకోవడానికి అన్ని సిద్దం చేసుకున్నారు. కాబుల్ లో ని ఓ ప్రాంతం నుంచి హెలికాప్టర్ లో కుటుంబంతో సహా తరలి వెళ్లాడు.
ఈ ఆపరేషన్ కోసం అమెరికా కాంగ్రెస్ సభ్యులు, రక్షణ, విదేశాంగ శాఖ నుంచి సాయం కోరినట్లు తెలుస్తోదంి. అమెరికా ప్రత్యేక దళాల సహకారంతో ఈమేరకు ఆయన సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. తాలిబన్ల నుంచి తప్పించుకోవడం అంటే మాటలు కాదు. వారు ఇళ్లన్నీ సోదాలు చేస్తూ ఈ అధికారి కోసం ఆరా తీశారు. ఒకవేళ దొరికి ఉంటే ఆయన ప్రాణం పోయేది. వారు ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. అంతటి నరరూప రాక్షసుల నుంచి తప్పించుకోవడం ఓ వరమే.