https://oktelugu.com/

afghanistan: మహిళలు, బాలికలపై తాలిబన్ల అత్యాచారాలు

అమెరికా సైన్యం వైదొలగడంతో రెట్టించిన ఉత్సాహంతో తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను కైవసం చేసుకుంటున్నారు. తాలిబన్ల దురాక్రమణతో అక్కడి ప్రభుత్వం సైన్యం, పోలీసులు తేలిపోతున్నారు. ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వదులుకుంటున్నారు. ప్రస్తుతం రాజధాని కాబూల్ తప్పితే కీలక దేశమంతా తాలిబన్ల వశమైంది. మరో 50 కి.మీలు మాత్రమే కాబూల్ కు దూరంగా తాలిబన్లు ఉన్నారు. అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ భయానకంగా కొనసాగుతోంది. నగరాలు,పట్టణాలను కైవసం చేసుకుంటున్న తాలిబన్లు, మహిళలు, యువతులను పెళ్లి పేరుతో శృంగారానికి బానిసలుగా చేసుకుంటున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2021 2:38 pm
    Follow us on

    అమెరికా సైన్యం వైదొలగడంతో రెట్టించిన ఉత్సాహంతో తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను కైవసం చేసుకుంటున్నారు. తాలిబన్ల దురాక్రమణతో అక్కడి ప్రభుత్వం సైన్యం, పోలీసులు తేలిపోతున్నారు. ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వదులుకుంటున్నారు. ప్రస్తుతం రాజధాని కాబూల్ తప్పితే కీలక దేశమంతా తాలిబన్ల వశమైంది. మరో 50 కి.మీలు మాత్రమే కాబూల్ కు దూరంగా తాలిబన్లు ఉన్నారు.

    అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ భయానకంగా కొనసాగుతోంది. నగరాలు,పట్టణాలను కైవసం చేసుకుంటున్న తాలిబన్లు, మహిళలు, యువతులను పెళ్లి పేరుతో శృంగారానికి బానిసలుగా చేసుకుంటున్నారు. కొందరిని ఎత్తుకుపోయి అత్యాచారాలు చేస్తున్నారు. అడ్డువచ్చిన వారి కుటుంబంలోని పురుషులను చంపేస్తున్నారు.

    అప్ఘనిస్తాన్ లో మహిళలు, యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. తాలిబన్లు ఆడది కనబడితే చాలు చెరిచేస్తున్న పరిస్తితి నెలకొంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తాజాగా తాలిబన్లు తక్షణమే దాడులు నిలిపివేయాలని పిలుపునిచ్చాడు. చర్చలకు రావాలని పిలుపునిచ్చాడు.సమాజమంతా ఒక్కటి కావాలని ఆయన కోరారు.

    అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ ను వీడడంతోనే తాలిబన్లు దేశాన్ని కైవసం చేసుకునే పనిలో పడ్డారు. కొద్దికాలంలోనే 60శాతానికి పైగా దేశం వారి వశమైంది. మరో వారంలో మొత్తం అప్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల హస్తగతం కానుంది. అక్కడి ప్రజా ప్రభుత్వం మొత్తం కూలిపోయి ఉగ్రవాదుల తాలిబన్ల రాజ్యం స్థాపన కానుంది. దీంతో పౌరులు పౌరహక్కులు, ముఖ్యంగా ఆడవారికి ఆ దేశంలో రక్షణ కరువు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఇ్పటికే ఆక్రమణలకు గురైన నగరాల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని.. లొంగని వారిని చంపేస్తున్నారని.. సెక్స్ బానిసలుగా చేస్తున్నారని ఐరాసా ఆవేదన వ్యక్తం చేసింది. అప్ఘన్ లో పరిస్థితి హృదయ విదారకంగా ఉందని చెబుతున్నారు. ఐరాసా అయినా రంగంలోకి దిగి అప్ఘన్ లో శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.