Andhra Pradesh CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్ద కర్రతో కొట్టాలి అన్న విధంగా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో కొద్దికాలంగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు రోజురోజుకు వైసీపీ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. ఇంత వరకు ప్రత్యక్షంగా విమర్శలకు దిగిన వైసీపీ సర్కారు ఇప్పుడిక పత్రికా ప్రకటనలు చేస్తోంది. అధికారికంగా సర్కారు ప్రకటనల పేరిట గతప్రభుత్వం చేసిన పనులను ఎత్తిచూపుతోంది. ఇప్పటికే ఏపీని ఇలా అభివృద్ధి చేస్తున్నాం.. అలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా వారి ఘటన తెలిపేలా .. రూ.కోట్లలో పత్రికా ప్రకటనలు ఇస్తోంది. తాము చేస్తున్న పనులతో పాటు.. గత ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ వస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న వన్ టైం సెటిల్మెంట్ స్కీం గురించి వైసీపీ సర్కారు ఫుల్ పేజీ ప్రకటనను ఇచ్చేసింది. వన్ టైం సెటిల్మెంట్ స్కీం గురించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి పత్రిక ప్రకటనలు ఇవ్వడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు కూడా ఇందులో ప్రచురించడం వైసీపీ ప్రభుత్వం ఓవర్ యాక్షన్ కనిపిస్తోంది. ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చినా.. సారాంశం ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఓటీఎస్ స్కీంను చంద్రబాబు వద్దారన్నారని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ తను ఏం లాభం ఉంటుందో ఆలోచన చేయడం లేదు.
పేదల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు. ఇదీ అందరికీ తెలిసిన ముచ్చటే. అదే కాకుండా ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్న ఇంటికి తమకు హక్కులు కల్పిస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటనలు చేయడం వింతగా ఉందని పలువురు అంటున్నారు. అయితే పేదలపై భారం పడొద్దనే ఆలోచన తోనే తాము ఓటీఎస్ అమలు చేయడం లేదని టీడీపీ చెప్పుకొచ్చింది. వైసీపీ సర్కారు ఏమో.. రూ.నాలుగు వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఉచిత రిజిస్ర్టేషన్లు చేస్తామని చెబుతున్న టీడీపీ వైసీపీ మాటలు నమ్మవద్దని సూచిస్తోంది. దీంతో వైసీపీ డైలమాలో పడి.. ప్రకటనతో రూ.కోట్లు వృథా చేస్తోంది.