https://oktelugu.com/

Adani: నాట్‌ ఇంట్రెస్ట్‌: రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్న అదాని..

Adani: దేశంలో 57 రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ రెండు రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నాలుగు స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకస్థానాన్ని పారిశ్రామిక వేత్త అదాని భార్య ప్రీతి అదానికి కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రితో సమావేశమై ఈమేరకు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2022 / 02:50 PM IST
    Follow us on

    Adani: దేశంలో 57 రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ రెండు రోజుల క్రితం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నాలుగు స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకస్థానాన్ని పారిశ్రామిక వేత్త అదాని భార్య ప్రీతి అదానికి కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రితో సమావేశమై ఈమేరకు అంగీకారం కూడా తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ కూడా రావడంతో ఆ ప్రచారం కూడా పతాకస్థాయికి చేరింది. అయితే ‘ మేము ఏ పార్టీలో చేరడంలేదని, ఏ సభకు వెళ్లబోవడంలేదు’ అంటూ అదానీ గ్రూప్‌ అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

    Adani, jagan

    రాజకీయాలకు దూరంగా..
    ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం తమకు లేదని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గతంలో రిలయ¯Œ ్స గ్రూప్‌ తరఫున పరిమళ్‌ నత్వానీ రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి పార్టీ తరఫున ఎంపిక కావాలని వైసీపీ పెద్దలు షరతు విధించడంతో నత్వానీ వైసీపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ తరఫున నామినేషన్‌ వేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. తాజాగా అదాని భార్య ప్రీతి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే తప్పనిసరిగా వైఎస్సార్‌ సీపీలో చేరాల్సి ఉంటుంది. పార్టీల తరఫున ఎంపిక కావడం ఇష్టం లేని అదానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పలేక.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని అదాని గ్రూప్‌ ప్రకటించింది.

    Also Read: Amit Shah- Bandi Sanjay: సంజయ్‌ గో హెడ్‌ : కాషాయానికి బండే విజయ సారథి.. సంజయ్‌పై అధిష్టానం ధీమా.. తుక్కుగూడ సభావేదికగా అమిత్‌షా కీలక ప్రకటన !!

    ఆ సీటు ఎవరికో మరి?

    Adani, jagan

    రాజ్యసభ రేసు నుంచి అదాని తప్పుకున్నారు. దీంతో అదానీ గ్రూప్‌నకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీటు ఇప్పుడు ఎవరికి ఇస్తారన్న చర్చ ఏపీలో మొదలైంది. ప్రధాని మోదీ సూచన మేరకు భారతీయ జనతాపార్టీ తరఫున ఎవరికైనా కేటాయిస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వైసీపీతో బీజేపీ పొత్తు ఖరారు చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వైసీపీ అధినేత ఇందుకు సుముఖత చూపుతారా అనేది సందేహమే. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఇన్నాళ్లూ ఏపీలో చేసిన పోరాటమంతా వృథా అవుతుందన్న భావన వైఎస్సార్‌ సీపీ నేతల్లో నెలకొంది. ఈ మైత్రి వచ్చే ఎన్నికల్లో కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. రాజ్య సభకు ఎవరిని పంపుతారో వైసీపీ నుంచి స్పష్టత వస్తే అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది.

    రెండురోజుల్లో స్పష్టత..
    నాలుగు రాజ్యసభ స్థానాలకు ఒకటి విజయసాయిరెడ్డిని తిరిగి పంపించాలని జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం. మరో రెండు స్థానాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మస్తా¯Œ రావును ఎంపిక చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదానీ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. నేతలంతా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల కోటాలో ఎంపిక చేయాలంటే మైహోం రామేశ్వరరావుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    Also Read:YCP Leader Murdered: వైసీపీలో వర్గపోరు..దళిత నేత దారుణ హత్య

    Tags