Adani On AP: అదానీ..అయితే ఓకే!

అదానీకి స్టెమీ ని అప్పగించేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రూప్ అడుగుతున్న దానిని పరిశీలించాలని, సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 1, 2023 8:14 am

Adani On AP

Follow us on

Adani On AP: ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందుగలడని.. వెనుకటికి నారాయణుడి ప్రస్తావనను కవులు ఈ విధంగా వివరించారు. ప్రస్తుత కాలానికి ఈ నానుడిని గౌతమ్ అదానికి అచ్చుగుద్దినట్టు అన్వయించవచ్చు. 2014 క్రితం వరకు ఇండియాలో ఒక వ్యాపారవేత్తగా ఉండే అదానీ.. ఇప్పుడు ఏకంగా ఇండియా కే అత్యంత కీలకమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఒక తొమ్మిది సంవత్సరాల కాలంలో వ్యాపారాలను అనితర సాధ్యమైన రీతిలో పెంచుకున్నాడు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాల్లో తన వ్యాపారాలను విస్తరించాడు. మీడియా, సిమెంట్, హాస్పిటాలిటీ.. ఇలా ఏ రంగంలో చూసుకున్నప్పటికీ
అదానీ తన హవా కొనసాగిస్తున్నాడు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏపీలో అడుగు పెట్టాడు. తనకు అనుకూలంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో దర్జాగా దూసుకుపోతున్నాడు.

అదానీ హవా

ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అదానీ హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదానీ పని ప్రాజెక్టు లేదు. తాజాగా ఆరోగ్యశాఖలో ఏదో ఒక ప్రాజెక్టు కచ్చితంగా ఇవ్వాలని అదానీ గ్రూప్ ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. ప్రభుత్వం కూడా ఆ శాఖలో
అదానీ గ్రూప్ చేపట్టే ప్రాజెక్టును పరిశీలిస్తోంది. ఇదే సమయంలో అదానీ భారీ హెల్త్ ప్రాజెక్ట్ స్టేమిని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా అదానీ కోరిక తీర్చేందుకు సుముఖంగా ఉంది. ఆరోగ్యశాఖ అధికారులు అడ్డుచేపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అధికారులు అడ్డు చెబుతున్నప్పటికీ అదానీ ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతానికి అదానీ గ్రూప్ నుంచి ఈసీజీ మిషన్లు కొనుగోలుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

పరిశీలించి, సమన్వయం చేసుకోవాలి

అదానీకి స్టెమీ ని అప్పగించేందుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రూప్ అడుగుతున్న దానిని పరిశీలించాలని, సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అదాని గ్రూప్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వారు ఒక ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ని చూసి ఉన్నతాధికారులు శాఖ అయ్యారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్టెమీ ప్రాజెక్టును తమకు అప్పగించాలని అదా నీ ప్రతినిధులు కోరడం ఆరోగ్యశాఖ అధికారులను నివ్వెరపరిచింది. తొలుత పైలట్ ప్రాజెక్టు చేస్తామని, ఆ తర్వాత ప్రాజెక్టును నిర్వహిస్తామని వివరించారు. మాట విన్న ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. స్టెమీ అంటే చిన్న ప్రాజెక్టు కాదు. ఆరోగ్య రంగంలో కనీస అవగాహన లేని అదానికి ఈ ప్రాజెక్టు ఇవ్వడం సాధారణ విషయం కాదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యా సాధ్యాలను పరిశీలించి ఏదో ఒక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. చేసేది ఏమీ లేక ఆరోగ్య శాఖ అధికారులు అదానీ పరిధిలో అనేకసార్లు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారు మాత్రం స్టెమి ప్రాజెక్టు తమకే ఇవ్వాలని ఇప్పటికీ కోరుతున్నారు.

2017 నుంచి..

ఏపీలో స్టెమీ ప్రాజెక్టు ఐసీఎంఎస్ సహకారంతో తిరుపతిలో అమలవుతోంది. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్టును విస్తరించారు. ఐదు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న విధానాన్ని మిగిలిన మూడు సెంటర్లకూ విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టును తమకు ఇచ్చేయాలని అదానీ గ్రూప్ పట్టుపడుతోంది. గుజరాత్ ప్రభుత్వానికి ఈసీజీ మిషన్లు సరఫరా చేస్తున్నామని, ఏపీకి కూడా అదేవిధంగా సరఫరా చేస్తామని అదాని గ్రూప్ చెబుతోంది. స్టెమీ ప్రాజెక్టులో 70 నుంచి 80 ఈసీజీ మిషన్లు అవసరమవుతాయి. వాటిని మొత్తం తామే సరఫరా చేస్తామని అదానీ గ్రూపు చెబుతోంది. తాజాగా ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నితంగా ఉండే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని మొత్తం చూస్తున్నట్టు తెలుస్తోంది..