Kedarnath ropeway project: ఇప్పటికే మోడీ అదాని గురించి ప్రతిపక్ష కాంగ్రెస్ బీభత్సంగా ప్రచారం చేస్తోంది. ఆ మధ్య హిడెన్బర్గ్ నివేదికను పట్టుకొని పార్లమెంట్లో రచ్చ చేయాలని చూసింది. చివరికి క్లీన్ చీట్ లభించడంతో అదానీకి ఊరట లభించింది. అలాగని ప్రతిపక్ష కాంగ్రెస్ ఊరుకోవడం లేదు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ అదానీ మీద అడ్డగోలుగా విమర్శలు చేస్తోంది. విలువైన వనరులను అదాని గ్రూపునకు కట్టబెడుతోందని ఆరోపిస్తోంది. ఇలా ఎన్ని వినిపించినప్పటికీ.. ఏ స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ అదానీ ఊరుకోవడం లేదు. పయతన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది ఆ కంపెనీ. తాజాగా ఆ కంపెనీ చేతిలోకి ఓ కాంట్రాక్ట్ వచ్చింది. అది మామూలు కాంట్రాక్ట్ కాదు..
మనదేశంలో ప్రసిద్ధమైన జ్యోతిర్లింగాలలో కేదార్ నాథ్ ఒకటి. ఈ ప్రాంతంలో స్వామివారి శివలింగం అద్భుతంగా ఉంటుంది. హిమాలయాలకు దగ్గరలో ఉండడంతో ఇక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాలి. వాతావరణం నిత్యం కఠినంగానే ఉంటుంది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఎక్కి దిగాలి. మధ్యలో వాగులు, వంకలను దాటుకొని వెళ్ళాలి. ఒక వయసు వారికైతే ఇబ్బంది లేదు కానీ.. వృద్ధులకు అయితే ఇబ్బంది తప్పదు. ఇంతటి ఇబ్బంది ఉన్నప్పటికీ చాలామంది శివుడిని దర్శించుకోవాలని భావిస్తారు. మిగతా జ్యోతిర్లింగాలతో పోల్చి చూస్తే కేదారినాథ్ విభిన్నమైనది. ఇక్కడ వాతావరణం కూడా విభిన్నంగా ఉంటుంది. నిత్యం మంచు కురుస్తూ ఉంటుంది. అందువల్లే ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ క్షేత్రానికి పర్యాటకంగా శోభ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం అడుగులు వేస్తోంది.ఈ తీర్థ స్థలికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.. అనారోగ్యాలు, వృద్ధాప్య సమస్యలు ఉన్నవాళ్ళకు క్లిష్టంగా మారిన ఈ యాత్రను అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తోంది కేంద్రం.
సోనా ప్రయాగ నుంచి కేదార్ నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల లో రోప్ వే నిర్మించబోతున్నారు. దీనివల్ల గంటల తరబడి సాగే యాత్ర 30 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని అదాని కంపెనీ దక్కించుకుంది. ఈ పనులు అదాని గ్రూప్ కు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? ఎటువంటి విమర్శలు చేయదా? ఇప్పుడు ఈ ప్రశ్నలే జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇటీవల హిండెన్ బర్గ్ నివేదిక మీద ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. అదానీ గ్రూప్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ప్రతిపక్షాలు విమర్శలను తట్టుకొని.. రకరకాల నివేదికలను అధిగమించి అదాని గ్రూప్ బయటపడింది. ఈ పనులు సక్రమంగా చేసి.. నాణ్యత గనక పాటిస్తే ప్రతిపక్షాల నోర్లు మూత పడతాయి.