Bandla Ganesh advice to Mouli: బండ్ల గణేష్(Bandla Ganesh)..ఒకప్పుడు కమెడియన్ గా, ఆ తర్వాత నిర్మాతగా ఈయన పొందిన గుర్తింపు ఎలాంటిదో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. అయితే రీసెంట్ గానే సూపర్ హిట్ గా నిల్చిన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఒక అతిథిగా పాల్గొన్న బండ్ల గణేష్, ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం గా కూడా మారాయి. అంతలా ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాము.
ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమా చేసిన మౌళి..నీకు ఒక మాట చెప్తున్నాను. ఈ 20 రోజులు జరిగింది మొత్తం ఒక అబద్దం, ఒక కల్పన, ఒక 3D అనుకో. కళ్ళజోడు తియ్యి, ఈ సినిమా రిలీజ్ రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదనే నిలబడి ఉండు. నాలాంటోడు నీ దగ్గరకి ఒకడు వస్తాడు, మౌళి గారు మీరు ఆరు అడుగుల పొడవు ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి వారు ఏమి పనికొస్తారండీ అని అంటారు. అవన్నీ నమ్మకు, నువ్వు ది గ్రేట్ లెజెండ్ చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ ని ఏలాలి అని కోరుకుంటున్నాను. మీ గాజువాక బేస్ ని అసలు మర్చిపోకు, ఈ ఫిలిం నగర్, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్దం, ఇంటికి వెళ్లిన తర్వాత వాస్తవానికి వెళ్ళిపో, నేను రోజు ఇంటికి వెళ్ళగానే షాద్ నగర్ లో ఉండే నా కోళ్ల ఫార్మ్ ని గుర్తు తెచ్చుకుంటాను. లేకపోతే వీళ్ళు బ్రతకనివ్వరు ఇక్కడ. ఈ మాఫియా మనల్ని బ్రాకతినివ్వదు’ .
‘ఈ మాఫియా ని తట్టుకొని నిలబడాలంటే మనం బేస్ మీద నిలబడాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పట్లో ఒక ఏడాది గ్యాప్ ఇచ్చింది. ఆ సమయం లో శ్రీకాంత్ ని హీరో గా పెట్టి పెళ్లి సందడి అనే సినిమా తీసాడు అల్లు అరవింద్ గారు, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అప్పట్లో శ్రీకాంత్ ఎక్కడికో వెళ్లిపోయారు అన్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటోళ్ళు కోటికి ఒకరు పుడతారు, వాళ్ళని మనం అందుకోలేము. నువ్వు మంచి నటుడివి, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.కాబట్టి పొగడ్తలను అసలు పట్టించుకోకు. విజయ్ దేవరకొండ టీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్ల గణేష్ అవి వేసాడు, ఇలాంటివన్నీ అబద్దాలు, ఇది నిన్ను ఆశీర్వదించాడు మాత్రమే చేస్తారు, ఇంకో శుక్రవారం ఇంకో మౌళి వస్తాడు, మరో వారం ఇంకొకడు వస్తాడు, చెడు అలవాట్లకు దూరం గా ఉండు, ఎవ్వరిని నమ్మకు, కేవలం నమ్మినట్టు నటించు, అల్లు అర్జున్ లాగా కష్టాన్ని టాలెంట్ ని నమ్ముకొని బ్రతుకు ఉన్నత స్థాయికి వెళ్తావు’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.
“#VijayDeverakonda ROWDY TShirt ఇచ్చాడు… #MaheshBabu Tweet వేసాడు… ఇవన్ని అబద్ధాలు.
నిన్ను Impress చెయ్యడానికి… Neeku wishes చెప్పడానికి చేస్తారు.
ఇంకో Friday ఇంకో #Mouli వస్తాడు.” pic.twitter.com/JGScQn7feJ
— Gulte (@GulteOfficial) September 18, 2025