
హీరోయిన్లకు రాజకీయ నాయకులకు విడతీయలేని అనుబంధం ఉంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు పలువురు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ముచ్చటించుకొనే కేసు కాస్త డిఫరెంట్. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికంఠన్ పై ఇప్పటికే కేసు కూడా పెట్టిన వ్యవహారం గురించి తెలిసిందే.
అసలు ఈ నటి చేస్తోన్న ఆరోపణల్లో ఎంత నిజం ఉందనే విషయం పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే చాందిని జరిగింది అంతా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘మణికంఠన్ నన్ను ప్రేమిస్తున్నానని నాకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను కూడా అతని ఇష్టాలను కాదనలేదు. దాంతో ఐదేళ్ల పాటు నాతో శారీరకంగా గడిపి ఎంజాయ్ చేశాడు. మా సహజీవనం పై నేను ఎప్పుడూ సంతోషంగా లేను.
ఈ క్రమంలోనే నేను గర్భం కూడా దాల్చాను. నా గర్భాన్ని తొలగించమని ఎంతో బలవంతం చేశాడు. దాంతో నేను అయిష్టంగానే గర్భాన్ని తీయించుకున్నాను. అలా మూడుసార్లు నాకు కడుపు చేశాడు. మూడు సార్లు నేను గర్భాన్ని తీయించుకున్నాను. దాంతో ఎంతో కలత చెందిన నేను , పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాను. నేను పెళ్లి పై పట్టు పట్టినప్పుడల్లా తన కసి అంతా నా మీద తీర్చుకునేవాడు.
అయినా నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టాను. దాంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. పైగా నా కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాకు మణికంఠన్ నుంచి ప్రాణహాని ఉందని..ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అతని పై చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పుకొచ్చింది.