Pawan Kalyan -Shivaji : అది తెలుసుకున్న రోజు పవన్ సీఎం అవుతారు… నటుడు శివాజీ సంచలన కామెంట్స్

Pawan Kalyan -Shivaji : నటుడు శివాజీ గరుడ పురాణంతో పిచ్చ పాపులర్ అయ్యారు. అప్పట్లో టీడీపీ సానుభూతిపరుడిగా బీజేపీ ప్రభుత్వం చేయబోయేది ఇదే అంటూ ఓ అనాలిసిస్ చేశాడు. అప్పటి నుండి గరుడ పురాణం శివాజీగా ఆయన పేరుగాంచారు. గతంలో టీడీపీకి మద్దతుగా శివాజీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సడన్ గా శివాజీ స్వరం మార్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పొలిటికల్ కామెంట్స్ చేశారు. పవన్ ని పొగుడుతూనే విమర్శించారు. మీరు గట్టిగా […]

Written By: NARESH, Updated On : April 14, 2023 12:24 pm
Follow us on

Pawan Kalyan -Shivaji : నటుడు శివాజీ గరుడ పురాణంతో పిచ్చ పాపులర్ అయ్యారు. అప్పట్లో టీడీపీ సానుభూతిపరుడిగా బీజేపీ ప్రభుత్వం చేయబోయేది ఇదే అంటూ ఓ అనాలిసిస్ చేశాడు. అప్పటి నుండి గరుడ పురాణం శివాజీగా ఆయన పేరుగాంచారు. గతంలో టీడీపీకి మద్దతుగా శివాజీ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సడన్ గా శివాజీ స్వరం మార్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పొలిటికల్ కామెంట్స్ చేశారు. పవన్ ని పొగుడుతూనే విమర్శించారు. మీరు గట్టిగా అనుకోండి సీఎం అయిపోతారని నొక్కి వక్కాణించారు. చాలా గ్యాప్ తర్వాత శివాజీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

సదరు ఇంటర్వ్యూలో… నాకు ఏ నాయకుడి మీద కోపం లేదు. కేవలం సమాజం బాగుండాలని కోరుకుంటాను. ఎవరిని విమర్శించినా దాని కోసమే. జనసేనపార్టీకి ప్రజల్లో మద్దతు ఉంది. ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. గోదావరి జిల్లాల్లో జనసేన అద్భుతాలు చేయగలదు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. కానీ అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదో తెలియదు. ఆయన రోడ్డు మీదకు వస్తే అనుసరించాడనికి జనాలు సిద్ధంగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ వద్ద అనేక అస్త్రాలు ఉన్నాయి. వాటిని ఆయన సరైన సమయంలో వాడటం లేదు. ఈ విషయంలో వైఎస్ జగన్ బెటర్. నాకు కుర్చీ కావాలనుకున్నాడు. సాధించాడు. జగన్ కి ఉన్న ఫోకస్ పవన్ కళ్యాణ్ లో లేదు. వారిద్దరికీ అదే తేడా. పవన్ కళ్యాణ్ లో తెలియని శక్తి ఉంది. అది బయటకు తీయాలి. ఈ విషయం తెలుసుకున్న రోజున ఖచ్చితంగా ఆయన సీఎం అవుతారు… అని శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పరోక్షంగా ఆయన పొత్తులు వద్దు ఒంటరిగా యుద్ధం చేస్తే విజయం మీ సొంతమని చెప్పినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఆలస్యమైనా పర్లేదు లక్ష్యం నెరవేరాలంటే టీడీపీతో దోస్తీ వద్దని పవన్ అభిమానులలో కొందరి వాదన. పవన్ అభిమానులు వెంటనే వారాహి యాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు.