Modi’s Kashmir Mission : కశ్మీర్.. భూతల స్వర్గం.. ఇంతటి అందమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. భారత్ లాంటి ఉష్ణమండల దేశంలో ఇంతటి శీతల ప్రదేశం ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చు. కానీ భారత్-పాకిస్తాన్ విభజన.. భారత్ లో కశ్మీర్ విలీనం చిచ్చుపెట్టింది. కశ్మీర్ ను అల్లకల్లోలంగా మార్చింది. ఉగ్రవాదానికి కశ్మీర్ బలి అయిపోయింది.
నాటి నుంచి భారత్ ను పాలించిన ఈ కాంగ్రెస్ పెద్దలు సెక్యూలరిజం పేరుతో అక్కడ పార్టీలకు కొమ్ము కాసి కశ్మీర్ ను ఉగ్రవాదులకు అసాంఘిక శక్తులకు, అన్యాయాలకు నెలవుగా మార్చారు. అక్కడి పండిట్లను ఊచకోత కోసినా పట్టించుకున్న పాపాన పోలేదు.. 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకూ కశ్మీర్ లో భారతీయ జెండా ఎగురింది లేదు. పాకిస్తాన్ అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ జెండాలే కనిపించాయి. అక్కడి 370డీ లాంటి చట్టాలు ఇతరులను ఆ రాష్ట్రంలో ప్రవేశించడానికి లేకుండా.. ఏలాంటి భూ కొనుగోళ్లు, అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేశాయి.
కానీ మోడీ వచ్చాడు. 2014 తర్వాత కశ్మీర్ రాత మార్చాడు. ఇందుకోసం వందలమంది సైనికులు బలి అయిపోయినా.. సరే వెరవలేదు. కశ్మీర్ ను ఉగ్రవాద భూతం నుంచి బయటపడేయాలని కంకణం కట్టుకున్నాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టారు. కశ్మీర్ పై ప్రత్యేక హక్కులను తీసేసి భారత్ లో ఒక రాష్ట్రంగా విలీనం చేశారు. ప్రపంచమంతా తప్పుపట్టినా.. పాకిస్తాన్ గగ్గోలుపెట్టినా వెరవలేదు.
ఒకప్పుడు మోడీ 1990వ ప్రాంతంలో కశ్మీర్ లోని శ్రీనగర్ లాల్ చౌక్ చౌరస్తాలో భారత జాతీయజెండా ఎగురవేస్తానని వెళితే ఉగ్రవాదులు పోస్టర్లు కట్టి బెదిరించారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు వేసుకొని మోడీ వెళ్లాడు. కానీ జాతీయజెండాను ఎగురవేయనీయలేదు.నాడే మోడీ వాగ్ధానం చేశాడు. ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేయిస్తానని శపథం చేశారు. కట్ చేస్తే..
2014లో ప్రధాని అయిన మోడీ ఆ పంతం నెరవేర్చాడు. కశ్మీర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. జోడోయాత్రలో భాగంగా కశ్మీర్ వెళ్లిన రాహుల్ గాంధీ నాడు మోడీని జెండా ఎగురవేయనీయని ‘లాల్ చౌక్’ వద్దనే జాతీయ జెండాను ఎగురవేశాడు. అంతటి స్వేచ్ఛ.. స్వాతంత్ర్యాలను కల్పించిన ఘనత మన మోడీదే.
అందుకే నిన్న పార్లమెంట్ లో ఉద్వేగంగా మాట్లాడాడు. ‘కశ్మీర్ ను రావణకాష్టంగా మార్చినపార్టీ నేతనే ఇప్పుడు స్వేచ్ఛగా శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేశాడు. ఆ ఘనత తమ ప్రభుత్వానిది.. ఉగ్రవాద భూతం నుంచి బయటపడేసి ఇప్పుడు శ్రీనగర్ థియేటర్ లో ‘పఠాన్’ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచేలా చేస్తున్నాం.. ఇదే మేం చేసిన అభివృద్ధి’ అంటూ మోడీ సగర్వంగా చెప్పుకున్నాడు..
మోడీ నిజంగానే కశ్మీర్ తలరాత మార్చాడు. అసలు థియేటర్లు, సినిమాలు చూసేందుకు ఉగ్రవాదుల నుంచి ఆంక్షలున్న కశ్మీర్ లో ఇప్పుడు అందరూ సినిమాలు చూసేలా చేశాడు. ఎంతో అభివృద్ధి చేశాడు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి కశ్మీరీలకు స్వేచ్ఛావాయువులు పంచాడు. ఈ విషయంలో మోడీని నిజంగా అందరూ అభినందించాల్సిందే..
https://twitter.com/SRKUniverse/status/1623306382610169859?s=20&t=voA_1cySaoFQ6BpwbttT6g