Acharya Prerelease Event: Chiranjeevi Sensational Comments :ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు మెగా స్టార్ చిరంజీవి. ఈ సినిమా మొదట చిరంజీవి కోసం అనుకున్నది కాదన్న షాకింగ్ విషయం బయటపడింది. మొదట ‘ఆచార్య’ మూవీకి హీరోగా రాంచరణ్ ను అనుకున్నాడట కొరటాల.. కొరటాల-చరణ్ సినిమా ఓకే అయ్యేకే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రాజమౌళి హీరోగా రాంచరణ్ కు ఆఫర్ ఇచ్చాడట.. దీంతో రాజమౌళి సినిమాను వదలుకోలేక.. ఇటు కొరటాలను కాదనలేక సతమతమవుతున్న రాంచరణ్ కు అండగా నిలిచాడట చిరు. ఈ మేరకు కొరటాలను ఇంటికి పిలిపించి రాంచరణ్ తో కాకుండా తనతో సినిమా తీయాలని రిక్వెస్ట్ చేశాడట..దీనికి కొరటాల సంతోషంగా ఒప్పుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఆర్ఆర్ఆర్ కు అడ్డంకి తొలగిపోయాయి.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ లాక్ అయిపోవడంతో ఆచార్య కోసం ఓ కీలక పాత్రకు రాంచరణ్ ను ఇందులోకి తీసుకోవాలనుకున్నారు.కానీ రాజమౌళి ఒప్పుకుంటాడో లేదోనని ఏకంగా చిరంజీవి లేడిస్ సెంటిమెంట్ ప్రయోగించాడట.. ‘సురేఖ కోరిక అని.. తామిద్దరం ఒకే సినిమాలో నటించాలని అడుగుతోందని’ చిరంజీవి వినమ్రంగా రాజమౌళిని కోరగా రాజమౌళి సైతం ఓకే చెప్పాడు. అలా ఆచార్యలో రాంచరణ్ నటించడానికి కూడా రాజమౌళినే కారణమని చిరంజీవి ఈ సినిమా తాలూకా పాతవిషయాలు చెప్పి ఆశ్చర్యపరిచాడు.
‘ఆచార్య’ మూవీ ఫంక్షన్ కాస్తా.. ఈ సినిమాకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకధీరుడు రాజమౌళి భజనతో నిండిపోయింది. టాలీవుడ్ పెద్ద దిక్కు అయిన చిరంజీవి సైతం పెద్ద పెద్ద మాటలతో రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. పొగడ్తలకు అర్హుడే అయినా కూడా ఏకంగా ఈ లెవల్ లో చిరంజీవి పొగుడుతాడని ఎవ్వరూ అనుకోలేదు.. ఊహించలేదు. ఏకంగా ఇండియన్ సినిమాకే రాజమౌళి తోపు అని అనేశాడు మన చిరంజీవి.
ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎవరు మైక్ పట్టుకున్నా చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్, పెద్దరికం, మంచితనం గురించి మాట్లాడే వాళ్లు. చిరంజీవి మాత్రం రాజమౌళిని పొగడ్తలతో ముంచేశాడు.
‘భారతీయ చలన చిత్రరంగం ఓ మతం అయితే.. అందులో రాజమౌళియే పీఠాధిపతి’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిజానికి రాజమౌళి ఈ పొగడ్తలకు అర్హుడే. ఎందుకంటే ఇండియన్ సినిమాను బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిదే.. కేజీఎఫ్, పుష్ప సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్ కు వెళ్లాయంటే అదంతా రాజమౌళి చలవే. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్న భ్రమల నుంచి దక్షిణాది సినిమానే అన్నట్టుగా రాజమౌళి మార్చారు. అందుకే చిరంజీవి ఈ రేంజ్ లో పొగిడేశారు.
Recommended Videos:
[…] Koratala Siva- Boyapati Srinu: టాలీవుడ్ లో చాలామంది హీరోల మధ్య రిలేషన్ షిప్ ఉంది. అది పెద్దగా బయటకు రాలేదు. అలాగే దర్శకులు, నటుల మధ్య కూడా రిలేషన్ షిప్ ఉంది. ఈ విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఇలాంటి రిలేషన్ గురించి చెప్పాల్సి వస్తే.. పోసాని కృష్ణ మురళి, కొరటాల శివ, బోయపాటి శ్రీను గుర్తుకు వస్తారు. ఈ ముగ్గురూ రిలేటివ్స్ అనే చెప్పాలి. […]
[…] Thaman: కాపీ కొట్టడం అనేది తన జన్మ హక్కుగా పెట్టుకున్నట్లు ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ‘తమన్’. అసలు తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు తమన్. పాపం తమన్ ఎంతో కష్టపడి కాపీ కొట్టి ఒక పాటను రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు నెటిజన్లు. అందుకు తగ్గట్లుగానే తమన్ నుండి ఎలాంటి పాట వచ్చినా.. అది ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ కొట్టినట్టు సాక్ష్యాలు దొరకడమే ఇక్కడ కొసమెరుపు. […]