Homeజాతీయ వార్తలుTelangana BJP: సోమేశ్‌పై చర్య.. తెలంగాణ అధికారుకు బీజేపీ హెచ్చరిక! 

Telangana BJP: సోమేశ్‌పై చర్య.. తెలంగాణ అధికారుకు బీజేపీ హెచ్చరిక! 

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పట్టుమని పది నెలలు కూడా లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన పరిస్థితి ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఏర్పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానేం ఎన్నికల సంఘం చేతికి అధికారం పోకుండా చీఫ్‌ సెక్రటరీని గెంటివేసినంత పనిచేశారు. అదీ కూడా ఇతర ఐఏఎస్‌లు టెన్షన్‌ పడే రేంజ్‌లో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్వయంగా పోలీస్‌ బాస్‌ అంజనీకుమార్‌ కూడా ఏపీ క్యాడర్‌ అధికారి. ఆయనతోపాటు దాదాపుగా పది మంది వరకూ ఏపీకి కేటాయించినప్పటికీ ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. క్యాట్‌కు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఉంటున్నారు. ఇలాంటి వారు కీలక పొజిషన్లలో ఉన్నారు. ఇప్పుడు సోమేశ్‌కుమార్‌ వ్యవహారంతో వారంతా టెన్షన్‌ పడక తప్పదు.

Telangana BJP
cs somesh kumar

అధికార పార్టీ సేవలో తరింపుతోనే..
సీనియర్‌ సివిల్‌ సర్వీస్‌ అధికారులు ప్రభుత్వానికి, అధికార పార్టాకి మద్దతుగా ఉంటున్నారని.. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సోమే‹శ్‌పై వేటు వేయడం ద్వారా.. ఇతర అధికారులకు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పంపినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఫేవర్‌గా ఉండటానికి సివిల్‌ సర్వీస్‌ అధికారులు సిద్ధపడకపోతే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో గత ఎన్నికల్లో టీడీపీ చూసింది. ఎన్నికల నోటిఫికేషన్‌∙వచ్చాక సీఎస్‌ను మార్చేసి.. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాన్స్‌ ఇచ్చింది. అయన మొత్తం ఎన్నికల నిర్వహణను హైజాక్‌ చేసేశారు. తర్వాత జరిగిన కథేమిటో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ కూడా ఏపీ క్యాడర్‌ వివాదంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు ఎన్నికలకు ఇంకా పది నెలల వరకూ సమయం ఉండాగనే.. అధికార యంత్రాంగానికి బీజేపీ డైరక్ట్‌ హెచ్చరికలు పంపినట్లయింది.

నెక్స్‌ సింగరేణి సీఎండీ..
సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తర్వాత వేటు సింగరేణి సీఎండీ శ్రీధర్‌పై పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన కేంద్ర క్యాడర్‌లో ఉన్నారు. కేంద్రం అనుమతితో సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయన పదివీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. గత డిసెంబర్‌ 31తో పదవీకాలం ముగిసింది. పొడగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకుంటే కనుక కేంద్రం మళ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శ్రీధర్‌ హయాంలో సింగరేణిలో ప్రైవేటీకరణ వేగవంతమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రా కాంట్రాక్టర్లు సంస్థలో పనిచేస్తున్నారు. అక్రమాలు భారీగా జరుగుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత అండతో శ్రీధర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆయన కొనసాగితే సంస్థలో రాజకీయ జోక్యం కూడా పెరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పదవి పొడగిస్తే కేంద్రం రగంలోకి దిగుతుందని తెలుస్తోంది.

Telangana BJP
singareni cmd sridhar

మొత్తానికి ఎన్నికల ఏడాదిలో కేంద్రం రాష్ట్రంలో అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారుల భరతం పట్టే పని చేపట్టినట్లు సీఎస్‌ సోమేశ్‌పై చర్యద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version