అచ్చెన్నాయుడు మెడకు చుట్టుకున్న ఈఎస్ఐ కుంభకోణం

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత, అచ్చెన్నాయుడు పాత్ర ఉందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని…అధికారులు తెలిపారు. బోగస్ కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చి గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి […]

Written By: Neelambaram, Updated On : February 21, 2020 1:58 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత, అచ్చెన్నాయుడు పాత్ర ఉందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని…అధికారులు తెలిపారు.

బోగస్ కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చి గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని పేర్కొన్నరు. ఈఎస్ఐ డైరెక్టర్లుకు దాదాపు రూ. 51 కోట్ల చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే…136 శాతం అధికారంగా సంస్థలు టెండర్లలో చూపించాయి. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించినట్టు అధికారులు వివరించారు.