Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: ముద్రగడ గుర్తు లేరా? గట్టిగానే నిలదీసిన కుమార్తె!

Mudragada Padmanabham: ముద్రగడ గుర్తు లేరా? గట్టిగానే నిలదీసిన కుమార్తె!

Mudragada Padmanabham: తండ్రి పై కొడుకు కంటే కుమార్తెకు మమకారం ఎక్కువ. అది కూడా వృద్ధాప్యంలో ఉంటే మరి ఎక్కువగా ఉంటుంది దృష్టి కుమార్తెకు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముద్రగడ పద్మనాభం విషయంలో. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని పేరు మోసిన ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తే తగిన విధంగా స్పందించలేదు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు. మీకోసం, మీ పార్టీ కోసం ఇంతగా శ్రమించిన తన తండ్రిని పరామర్శించేందుకు కూడా మీకు వీలు కాలేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శించిన మీరు.. తమ తండ్రిని గుర్తు చేసుకోలేదా అంటూ గట్టిగానే ప్రశ్నించారు.

Kranti Mudragada
Kranti Mudragada

* సాయి కృష్ణ కుటుంబ పరామర్శ..
ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం మిస్టరీ సంచలనంగా మారింది. అయితే ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. వెంటనే వైసీపీ రాజకీయం మొదలు పెట్టింది. కనీసం ఆ యువకుడి పేరు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు.. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేశారు. అయితే ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రికి చేరినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ పై ఉన్న శ్రద్ధ ముద్రగడపై లేదా అని ఇప్పుడు ఆయన కుమార్తె ప్రశ్నించేసరికి ఒక్కసారిగా సిన్ మారింది. ఎందుకంటే కాపు ఉద్యమం చేపట్టి వైసిపి రాజకీయం చేయాలని చూసింది. అయితే ఇప్పుడు ముద్రగడను వాడుకొని వదిలేస్తారు అన్న విమర్శ సొంత కుమార్తె చేయడం తో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.

* పరామర్శించకపోవడాన్ని ప్రశ్నించిన కుమార్తె..
గతంలో కూడా తన తండ్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందారు కుమార్తె క్రాంతి. తన తండ్రిని చూసేందుకు కూడా తనకు అనుమతి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగానే ఉపయోగపడ్డారు. అలా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.. కానీ ఇప్పుడు ముద్రగడ అనారోగ్య సమస్యలకు ఆర్థిక సాయం చేయడం లేదు. కనీసం పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. గతంలో కిర్లంపూడి వరకు వెళ్లిన జగన్ ముద్రగడ ఇంటికి వెళ్లలేదు. ఆయన వచ్చి తాడేపల్లిలో కలిస్తే తప్ప జగన్ పరామర్శించిన పరిస్థితి లేదు. ఇప్పుడు స్వయంగా ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రికి పరామర్శ, ఆర్థిక భరోసాపై ప్రశ్నించడంతో డిఫెన్స్ లో పడిపోయారు వైసీపీ కాపు నేతలు. మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version