https://oktelugu.com/

బాబు దృష్టిలో పవన్ కళ్యాణ్‌ కూడా విలనే..

రీల్‌ లైఫ్‌లో హీరోలు అయినంత మాత్రాన.. రియల్‌ లైఫ్‌లో హీరోలు అవ్వాలని ఎక్కడా లేదు. అలా జరగదు కూడా. ఉదాహరణకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్స్‌గా యాక్టింగ్‌ చేస్తుంటాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంత మందికి అండగా నిలిచాడో అందరం చూశాం. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చాడు. ఇక బాలీవుడ్‌, టాలీవుడ్‌లో టాప్‌ హీరోలు ఏ స్థాయిలో ఆదుకున్నారో కూడా అందరికీ తెలిసిందే. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 08:14 AM IST
    Follow us on

    రీల్‌ లైఫ్‌లో హీరోలు అయినంత మాత్రాన.. రియల్‌ లైఫ్‌లో హీరోలు అవ్వాలని ఎక్కడా లేదు. అలా జరగదు కూడా. ఉదాహరణకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్స్‌గా యాక్టింగ్‌ చేస్తుంటాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంత మందికి అండగా నిలిచాడో అందరం చూశాం. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చాడు. ఇక బాలీవుడ్‌, టాలీవుడ్‌లో టాప్‌ హీరోలు ఏ స్థాయిలో ఆదుకున్నారో కూడా అందరికీ తెలిసిందే.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇక టాలీవుడ్‌లో పవర్‌‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ టాప్‌ హీరో. సినిమాల్లో హీరో అయిన పవన్‌.. జగన్‌ సినిమాలో మాత్రం విలన్‌. పవన్ సినిమాలో జగన్ విలన్. ఇక చంద్రబాబు సినిమాలో కూడా లేట్‌గా అయినా లేటెస్ట్‌గా పవన్ కల్యాణ్ విలన్ అయ్యారట. ఇది నిజంగానే గమ్మత్తయిన విషయమే. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఆయన పొత్తు పెట్టుకున్న బీజేపీ విషయం తీసుకుంటే అన్నీ గందరగోళం వ్యవహారంగానే సాగుతోంది. అమరావతి రాజధాని కథ తేల్చదు, ముంచదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని సరిపెట్టుకున్న కూడా పోలవరాన్ని తాజాగా ముంచేసే అధ్యాయంగా తేల్చేసింది.

    Also Read: లోకేష్ కోసం త్యాగం చేసేది చంద్రబాబా? మామ బాలయ్యనా?

    దాంతో ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు అంటున్నారు. పైగా ఏపీ రాజకీయాలే దారుణంగా ఉన్నాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారని టాక్. బీజేపీ విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉండడం వల్లనే పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నారని కూడా చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు గాజువాక, భీమవరంలో గెలిచేందుకు పరోక్ష సహకారం ఇచ్చి వైసీపీకి టార్గెట్ అయి టీడీపీ తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఏడాదిన్నరగా వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజకీయంగా పోరాడుతూనే ఉంది.

    Also Read: విద్యాసంస్థల ఓపెన్‌పై జగన్‌ స్ట్రాటజీ ఏంటి..?

    కానీ.. నమ్ముకున్న పవన్ కాస్తా బీజేపీకి జై కొట్టి టీడీపీకి దూరం కావడాన్ని పసుపు పార్టీ సహించలేకపోతోందట. అంతే కాదు.. చంద్రబాబు కలల రాజధాని అమరావతి విషయంలోనూ పవన్ కనీసం పెదవి విప్పడం లేదు. ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగానే నిర్వహించేద్దామని.. వీలైనంత రాజకీయ లబ్ధి పొందుదామని టీడీపీ పెద్ద ప్లానే చేస్తోంది. అయినా.. దీనికి కూడా పవన్‌ కలిసిరావడం లేదంటూ టీడీపీ మండిపడుతోంది. అందుకే అనుకూల మీడియాలో పవన్ కల్యాణ్ మీద మళ్లీ వ్యతిరేక కథనాలు వడ్డిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇక తమతో కలసి రారు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారా అన్న డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఏపీలో టీడీపీ పోరాటం ఒంటరిగా మారుతోంది. ఈ దెబ్బతో పవన్ కల్యాణ్ అటో ఇటో తేలిపోవాలి అన్నది టీడీపీ కూడా రెడీ అవుతోందట. మొత్తంగా చూస్తే.. జనసేనతో పూర్తిగా తెగతెంపులు చేసుకునేందుకే టీడీపీ సిద్ధపడినట్లు తెలుస్తోంది.