https://oktelugu.com/

ఉద్రిక్తతకు దారితీసిన విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించిన విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తలకు దారితీసింది. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ గేటు దూకే ప్రయత్నాన్ని ఏబీవీపీ కార్యకర్తలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కొద్ది మేర లాఠీ చార్జి చేశారు. పోలీసుల లాఠిచార్జిలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 11, 2020 / 12:34 PM IST
    Follow us on

    విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించిన విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తలకు దారితీసింది. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ గేటు దూకే ప్రయత్నాన్ని ఏబీవీపీ కార్యకర్తలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కొద్ది మేర లాఠీ చార్జి చేశారు. పోలీసుల లాఠిచార్జిలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.

    ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే విద్యారంగానికి బడ్జెట్లో 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్నారు. కేజీ టూ పీజీ విద్యను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ కార్యకర్తలు విమర్శించారు.

    పోలీసులు విద్యార్థులను అదుపులోకి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పోలీసుల విద్యార్థులపై లాఠిచార్జి చేయడాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖండిస్తున్నారు. సమస్యలపై పోరాడే వారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.