తాజాగా హాలీవుడ్ సినిమా ‘నో టైమ్ టు డై’ (జేమ్స్‌బాండ్ సిరీస్‌లో 25వ చిత్రం) విడుదల కరోనా దెబ్బకు వాయిదా పడింది. బాలీవుడ్ మూవీ ‘83’ మూవీ ట్రైలర్ లాంచ్ కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అలాగే ప్రాంతీయ సినిమాల నిర్మాతలు కూడా తమ మూవీలను ప్రస్తుతం రిలీజ్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకపోతే నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కేరళలో కరోనా ప్రభావంతో నేటి నుంచి మార్చి 31వరకు థియేటర్స్‌ను మూసివేయాలని కేరళ ప్రభుత్వం సూచించింది. ‘ఈ నెల 16వరకూ క్లోజ్ చేస్తాం.. ఆ తర్వాతి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తాం’ అని కేరళ చిత్రనిర్మాతల మండలి అధ్యక్షుడు ఎం. రంజిత్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్, రిలీజు వాయిదా వేసుకోవడం ఉత్తమమని నిర్మాతలు భావిస్తున్నారు. కరోనా ప్రభావం ఇలానే కొనసాగితే చిత్రపరిశ్రమ ఆర్థికంగా నష్టపోక తప్పదు. ఈ కరోనా ప్రభావం ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో చూడాలి మరీ..