https://oktelugu.com/

కరోనా బాధితుల్లో 30శాతం మంది యువత!

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదటి వేవ్ లో 45 ఏళ్లు పైబడిన వారిని, వృద్ధులకు మాత్రమే ఈ వైరస్ పెను ప్రభావం చూపింది. కానీ సెకండ్ వేవ్ లో తన రూపం మార్చుకొని మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రధానంగా ఊపిరి ఆడనివ్వకుండా చేసి ఆక్సిజన్ అవసరం అయ్యేలా చేస్తోంది. తాజాగా ఆస్పత్రుల్లో చూస్తే కరోనా సోకిన బాధితుల్లో 30శాతం మంది యువతనే బాధితులుగా ఉండడం కలవరపరుస్తోంది. హైదరాబాద్ ఆస్పత్రుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2021 3:14 pm
    Follow us on

    కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొదటి వేవ్ లో 45 ఏళ్లు పైబడిన వారిని, వృద్ధులకు మాత్రమే ఈ వైరస్ పెను ప్రభావం చూపింది. కానీ సెకండ్ వేవ్ లో తన రూపం మార్చుకొని మరింత ప్రమాదకరంగా మారుతోంది. ప్రధానంగా ఊపిరి ఆడనివ్వకుండా చేసి ఆక్సిజన్ అవసరం అయ్యేలా చేస్తోంది.

    తాజాగా ఆస్పత్రుల్లో చూస్తే కరోనా సోకిన బాధితుల్లో 30శాతం మంది యువతనే బాధితులుగా ఉండడం కలవరపరుస్తోంది. హైదరాబాద్ ఆస్పత్రుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు తేలింది. చాలా మంది రోగులు అవసరం లేకపోయినా ఆక్సిజన్ వాడుతున్నారని.. అందుకే దాని కొరత తీవ్రమవుతోందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆ భయమే వారిని అలా పురిగొల్పుతోందని అన్నారు.

    ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో బాధితుల్లో 30శాతం మంది యువకులే కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ లో బలమైన రోగనిరోధకత ఉండే యువకులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారు.

    ఇక చిన్నపిల్లలకు కరోనా సోకినా వారికి ఇప్పటికే బోలెడు టీకాలు వేయడంతో తట్టుకునే శక్తి వారిలో వస్తోంది. అయితే పిల్లల్లో వైరస్ కనిపించడం లేదు. వారిలో అసలు ప్రభావం చూపడం లేదు.కానీ వారి వల్ల యువతకు, పెద్దవారికి సోకి ప్రాణాంతకంగా మారుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సో ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకొని జీవించడమే ఇప్పుడు అందరి ముందున్న కర్తవ్యం అని తెలుస్తోంది.