Open Heart With RK Vishnu Kumar Raju
Open Heart With RK Vishnu Kumar Raju: ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సాక్షిగా పచ్చ క్యాంపు జర్నలిస్టు.. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. స్వతహాగానే అతడు ఈ విషయాన్ని చాలా ఓపెన్ గా ఒప్పుకుంటాడు. ఈనాడు ఎంతో కొంత సమయమనం పాటించినప్పటికి… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అలాంటి వెసలు బాటు ఏమీ ఇవ్వకుండా నేరుగా పచ్చ రంగు పూసుకొని, టిడిపి డప్పు కొడుతుంటాడు. ఆయన దృష్టిలో చంద్రబాబు ఒక విజన్ ఉన్న నేత. ఆయన కుమారుడు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భావి ఆశా కిరణం. ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటు వేసే యంత్రాలు. ఈ విషయాలు బల్లగుద్ది చెప్పేందుకు రాధాకృష్ణ ఎటువంటి మొహమాట పడడు. ఎందుకంటే రాధాకృష్ణ నైజం మొదటి నుంచి అదే కాబట్టి.
ఏ చిన్న అవకాశం వచ్చినా..
చంద్రబాబుకు సంబంధించి ఏ చిన్న అవకాశం వచ్చినా రాధాకృష్ణ అసలు వదిలిపెట్టడు. తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో వచ్చే గెస్ట్ లతో ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు గురించి అడుగుతాడు. ఆరు ఆయన గురించి పాజిటివ్ గా చెప్పేంతవరకు వదిలిపెట్టడు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే విషయంలోనూ ఎక్కడా కూడా తగ్గడు. ఇక కెసిఆర్ అంటే కూడా రాధాకృష్ణకు కోపమే ఉంటుంది. వీలున్నప్పుడల్లా తన అక్కసు మొత్తం వెళ్లగకుతూ ఉంటాడు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో.
తన ఏబీఎన్ ఛానల్ లో రాధాకృష్ణ ప్రతివారం సమాజంలో విశిష్టమైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తాడు. నిన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజుతో రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశాడు.. తన ఇంటర్వ్యూ ద్వారా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలవాలని అల్టిమేటం ఇచ్చాడు. అంతేకాదు ఇదే విషయాన్ని విష్ణుకుమార్ రాజు ద్వారా చెప్పించాడు. దీంతో రాధాకృష్ణ చెప్పిన దానికి అనుమానియంగా విష్ణుకుమార్ రాజు తల ఊపాడు.
23 దగ్గర ఎందుకు ఆగినట్టు
ఒకవేళ రాధాకృష్ణ చెబుతున్నట్టు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు అవసరం ఉంటే జనం 23 దగ్గరే ఎందుకు ఆపినట్టు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ తీరుగా అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించినట్టు? జన్మభూమి,నీరు చెట్టు, పసుపు కుంకుమ.. ఇలా ఎన్నో పథకాల్లో అవినీతి రాజ్యమేలింది. కుల పత్రికలకు కోటానుకోట్ల రూపాయల యాడ్స్ రావడంతో అవి పచ్చ డప్పు కొట్టాయి. ఇదంతా చూసిన జనానికి కడుపు మండి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ దీనిని మాయ చేసేందుకు రాధాకృష్ణ పూనుకోవడం నిజంగా పిటీ. పైగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలవాలి, చంద్రబాబు సీఎం కావాలి అని రాధాకృష్ణ కోరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనినే తెలంగాణలో దింపుడు కల్లం ఆశ అంటారు.