Chandrababu- ABN RK: స్కిల్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనకు దక్కడం లేదు. పైగా ఏపీ సిఐడి పలు కేసుల్లో చంద్రబాబు పాత్రని, లోకేష్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నది. ఫలితంగా లోకేష్ ఢిల్లీ నుంచి రావడం లేదు. రంగంలోకి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి దిగినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏబీఎన్ సూత్రికరిస్తున్న తీరు మరో ఎత్తు.
“చంద్రబాబు అరెస్ట్ తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు ఖండించలేదు. పైగా కేటీఆర్ పక్క రాష్ట్రంలో గొడవ అయితే మాకు ఎందుకు సంబంధం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి దక్కే గౌరవం ఇదేనా? చంద్రబాబు అరెస్టు వల్ల నోరు మెదపని భారత రాష్ట్ర సమితి పెద్ద షాక్ ఎదురవ్వబోతోంది. కచ్చితంగా ఈ ఎన్నికల్లో టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్ళుతోంది. ముమ్మాటికి భారత రాష్ట్ర సమితి పరాజయం ఖాయం” ఇదీ ఏబీఎన్ ఛానల్ లో ప్రసారమవుతున్న కథనాలు.
వాస్తవానికి 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలను టిడిపి గెలుచుకుంది. తర్వాత వారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. ఇక ఏబీఎన్ ఛానల్ చెప్పిన ప్రకారం చూసుకుంటే చంద్రబాబు అరెస్టు ని మొదటగా బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి వారు ఖండించారు. వారు స్పందించినప్పుడు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు అరెస్టును ఖండించారు. అయితే ఇక్కడ ముందుగా స్పందించింది బిజెపి నాయకులు.. అలాంటప్పుడు తెలంగాణలో కొద్దోగొపో టిడిపి ఓటు బ్యాంకు ఉంటే అది బిజెపి వైపు మళ్ళాలి. కానీ యాదృచ్ఛికంగా ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మెర్జ్ అయిందని ఏబీఎన్ చెప్తుతున్నది. వాస్తవానికి తెలంగాణలో టిడిపి ఓటు బ్యాంకు అంతంతమాత్రంగానే ఉంది. నాగార్జునసాగర్ లో 2021 ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టిడిపి అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. కొన్నిచోట్ల కోటి చేయడానికి అభ్యర్థులే టిడిపికి లేరు. ఇక 2018 ఎన్నికల్లో కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి సుహాసిని పోటీ చేశారు. అక్కడ మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఆంధ్ర సెటిలర్ కోటర్లు అక్కడ ఎక్కువగా ఉన్నారని, కచ్చితంగా టిడిపి అభ్యర్థి విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు . కానీ అక్కడ జరిగింది వేరు. మరి ఏ రిపోర్ట్ ఆధారంగా ఏబీఎన్ ఇలా టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మరలిపోతోంది అని చెప్పిందో అంతు పట్టకుండా ఉంది. కొంపతీసి ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించే ఇంటలిజెన్స్ రిపోర్టు ఏబీఎన్ ఛానల్ కి ఏమైనా చేరిందా? ఏబీఎన్ పసుపు ఛానల్ అని తెలుసు కానీ.. మరీ ఈ స్థాయిలో పసుపు రంగు పూసుకుంటుందని, అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేయడం మాత్రం నిజంగా పిటీ!