Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఐదో వారం నామినేషన్స్ లో పవర్ అస్త్రా ఉన్నవారిని తప్ప మిగిలిన వారందరిని నామినేట్ చేశాడు బిగ్ బాస్ . సోమవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా శివాజీ అందరికంటే ముందంజలో దూసుకుపోతున్నాడు. సీరియల్ బ్యాచ్ గత వారం శివాజీకి చేసిన అన్యాయానికి ,ఆడియన్స్ నీకు మేము ఉన్నాం అంటూ శివాజీ కి సపోర్ట్ చేస్తున్నారు . నామినేషన్స్ లో కూడా సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ అనుకునే విధంగా ఒక్కడినే టార్గెట్ చేసి అందరూ కలిసి కత్తి పోట్లు దింపారు .
ఇలా జరగడం వలన ఆడియన్స్ లో బాగా సింపతీ వచ్చేసింది . శివాజీకి ఓట్లు గుద్దిపడేస్తున్నారు . గేమ్ పరంగా చూసుకుంటే శివాజీ ఆడినట్టు ఎవరు కూడా ఆడలేరు . గేమ్ పట్ల అతనికి ఒక అవగాహన ఉంది . ఏదో పొడిచేస్తాడు ,ఆడేస్తాడు అనుకున్న అమర్ దీప్ సుద్ద వేస్ట్ అనిపించుకున్నాడు. గొడవలు పడటం తప్ప ఆటలో జోరు చూపడం లేదు. అమర్ దీప్ గ్రాఫ్ చూసుకుంటే ఓటింగ్ లో ముందు వారాల్లో ఉన్నంత దూకుడు ఇప్పుడు లేదు .
పవర్ ఫుల్ డైలాగ్స్ కొట్టడం తప్ప అమర్ చేసేది ఏమి ఉండదు . స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అమర్ తీరు ఇలాగే ఉంటే మాత్రం ఇంటి కెళ్ళడం ఖాయం .ప్రియాంక విషయానికొస్తే మొదటి రెండు మూడు వారాల్లో ఉన్నంత ఆటతీరు ఇప్పుడు కనిపించడం లేదు . అమర్ తో కలిసి స్నేహం చేసి తనలా తయారైంది . ఆట ఆడడం మానేసి కబుర్లకే పరిమితం అయిపోయింది . ఈ వారం ఓటింగ్ రిజల్ట్ తీరు చూస్తే… ప్రియాంక ,తేజ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు, అంటే డేంజర్ జోన్ అని అర్థం.
ప్రియాంక ఈ వారం కూడా గేమ్ పై ఫోకస్ చేయకుండా ఇలానే ఉంటే ఎలిమినేట్ అవ్వక తప్పదు . ఇక తేజ ఇప్పటికే రెండు సార్లు ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఈ వారం ఆడియన్స్ ని ఆకట్టుకోగలితే మాత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది . ఏది ఏమైనా ప్రియాంక ఇంకా తేజ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఖాయం .