Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. దీంతో సామాన్యుడి పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAM ADMI PARTY)ని వరుసగా మూడుసార్లు గెలిపించిన ఢిల్లీ ఓటర్లు ఈసారి మాత్రం బీజేపీకి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 23 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం. ఇక ఈ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ అగ్రనేతలకు గట్టి షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నా ఆ పార్టీ మాజీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. లిక్కర్ కేసులోనే అరెస్ట్ అయి దాదాపు 18 నెలలు జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia)ను కూడా ఓడించారు. అవినీతి ఆరోపణల్లో అరెస్టు అయిన మరో మాజీ మంత్రి సత్యేంద్రజైన్(Satyendra Jain)ను కూడా ఓడించారు. దీంతో ఆప్‌కు ఊహించని దెబ్బ తగిలింంది. ప్రస్తుత సీఎం అతిశీ మాత్రం స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ముగ్గురూ లిక్కర్ స్కాం కేసులో నిందితులు..
ఇక ఓడిపోయిన ముగ్గురు ఆప్ నేతలు ఢిల్లీ మద్యం కుంభకోణం(Licqar Scham) కేసులో నిందితులు ముగ్గురూ జైలుకు వెళ్లి వచ్చారు. సామాన్యుడి పార్టీగా, అవినీతిపై పోరాటం చేస్తామని ఆప్ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్ అనూహ్య రీతిలో 2013లో అధికారంలోకి వచ్చారు. 2015లో ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ ఒంటరిగా పోటీ చేసి 67 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మొదటి ఐదేళ్లు పాలన బాగానే సాగింది. దీంతో ఆప్ ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయం అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీ మార్పు, ఇందకు భారీగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో అవినీతి మరక అంటింది. దీంతో ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఓడించారు.
ఓడినా భారీగా ఓట్లు..
ఇక ఎన్నికల్లో ఆప్ ఓడినా ఓట్లు మాత్రం భారీగా పోలయ్యాయి. 42 శాతం ఓట్లు ఆప్ సాధించింది. అయితే సీట్లను మాత్రం గెలవలకపోయింది. దీంతో ఆప్ 23 స్థానాలకు పరిమతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం భారీగా సీట్లు గెలిచి అధికారం చేపట్టబోతోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీటంపై కమలం వికసించింది.