https://oktelugu.com/

Sourav Ganguly : గంగూలీకి చుక్కలు చూపించిన యూట్యూబర్.. పశ్చిమ బెంగాల్లో కలకలం 

సౌరవ్ గంగూలీ.. పేరు చెప్తే వీరావేశం గుర్తుకొస్తుంది. ఇంగ్లాండ్ పై సిరీస్ నెగ్గిన తర్వాత చొక్కా విప్పి ఎగిరిన టీమిండియా కెప్టెన్ గుర్తుకు వస్తాడు. అలాంటి సౌరవ్ గంగూలీ చిక్కుల్లో పడ్డాడు.. ఓ యూట్యూబర్ చుక్కలు చూపించడంతో పోలీసులను ఆశ్రయించాడు. 

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 / 11:17 AM IST

    Sourav Ganguly comments

    Follow us on

    Sourav Ganguly : కోల్ కతా లో ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మృణ్ మోయ్ దాస్ అన్న యూట్యూబర్స్ స్పందించాడు. గంగులు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాడు. సౌరవ్ గంగూలీని సంఘ చేసుకుని సామాజిక మాధ్యమ ఖాతాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేశాడు. సౌరవ్ గంగూలీ గౌరవానికి భంగం కలిగించాడు. ప్రతిష్టకు మచ్చ వాటిల్లే లాగా ప్రవర్తించాడు. గంగూలీపై రాయడానికి వీలు లేని కామెంట్లు చేశాడు. గంగూలీపై ఆ యూట్యూబర్ రూపొందించిన కంటెంట్ దారుణాతి దారుణంగా ఉందని..కోల్ కతా పోలీసులు వెల్లడించారు. ఆర్ జీ కార్ ఆస్పత్రిలో 22 సంవత్సరాల మహిళ డాక్టర్ శిక్షణ పొందుతోంది. ఆమె ఇటీవల హత్యాచారానికి గురైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు కు సంబంధించి గంగోలి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సంచలనానికి కారణమయ్యాయి. “ఎక్కడైనా సరే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి. అవి చాలా అవసరం కూడా అని” గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గంగూలీపై సామాజిక మాధ్యమాలలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో గంగూలీ ఒక్కసారిగా ఇరుకునపడ్డాడు. పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతున్న సంకేతాలు కనిపించడంతో వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నాడు. పత్రికలు, చానల్స్ తప్పుగా అర్థం చేసుకున్నాయని వాపోయాడు.
    దొరికిందే తడవుగా..

    వైద్యురాలి హత్యాచారానికి సంబంధించి గంగూలీ చేసిన వ్యాఖ్యలను మృణయ్ మోయ్ తనకు ఆయుధంగా మలుచుకున్నాడు. సామాజిక మాధ్యమాలలో వాటికి తన సొంత భాష్యం చెప్పాడు. ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు. “అతడు ఒక సెలబ్రిటీ.. వాస్తవ పరిస్థితి తెలియదు. బీసీసీఐకి అధ్యక్షుడిగా కొనసాగాడు. అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడాడో చూశారా. అతడు బతికే ఉన్నాడు కదా.. జీవిత చరిత్రను ఎందుకు తెరకెక్కిస్తున్నారు. ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటివి చేస్తున్నారు.. బాధితురాలికి సంఘీభావం తెలుపకున్నా పర్వాలేదు.. కనీసం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా గంగూలీ వ్యవహరించాడని” ఆ యూ ట్యూబర్ సోషల్ మీడియాలో విమర్శలు చేశాడు. ఇవి దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఇవి గంగూలీ దాకా వెళ్లడంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ విషయాన్ని గంగూలీ కోల్ కతా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు ఆ యూట్యూబర్ పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని దృష్టిస్తోంది. మరోవైపు తమకు న్యాయం చేయాలని.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న వైద్యులు.. గంగూలీ వ్యాఖ్యలను తప్పు పట్టడం విశేషం.