https://oktelugu.com/

Vetri Maran : అసలు వెట్రి మారన్ కి భారీగా డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి..? ఆయనకు అంతలా గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నప్పటికీ వెట్రి మారన్ కి ఉన్న గుర్తింపు ఇంకెవ్వరికి లేదనే చెప్పాలి. ఆయన సినిమాలు ప్రేక్షకుడిని అలరించడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా సాధిస్తూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2024 / 11:23 AM IST

    Vetri Maran

    Follow us on

    Vetri Maran : తమిళ్ సినిమా దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించిన దర్శకుడు వెట్రి మారన్… ఆయన చేసిన సినిమాలన్నింటినీ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలపడంలో ఆయన ఎపుడు సక్సెస్ వుతూనే వస్తున్నాడు. అందువల్లే ఆయనకి చాలా మంచి గుర్తింపు అయితే లభించింది. ప్రస్తుతం ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఆయన సినిమాలు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి అది తమిళ్ నేటివేటికి తగ్గట్టుగానే ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలను మిగతా భాషల్లో డబ్ చేసినప్పటికీ అక్కడ పెద్దగా విజయాన్నైతే నమోదు చేసుకోవట్లేదు. మొత్తానికైతే వెట్రి మారన్ లాంటి దర్శకుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా తమిళ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మన తెలుగు స్టార్ హీరోలు సైతం ఆయన దర్శకత్వం నటించడానికి సిద్ధమవుతున్నారు.

    దానికి కారణం ఏంటి అంటే ఆయన సినిమాల్లో నటిస్తే నటులుగా వాళ్లకంటూ ఒక పరిపక్వత వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయనకి ఒక బ్రాండ్ ఉంటుంది. రోటీన్ సినిమాలను చేసే దర్శకులకు భిన్నంగా ఆయన సినిమాలు ఉంటాయి. అందులో ఒక ఎమోషన్ అయితే ఇన్ బిల్ట్ గా రన్ అవుతూ ఉంటుంది.

    ఇక హీరో పాత్రకి చాలా ప్రత్యేకతలు కూడా ఉంటాయి. అలాగే ఆయన ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్ ను చూపించడంలో కూడా చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాడు. ఒక కథకి ఎలాంటి నరేశన్ ఇస్తే ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందో బాగా తెలిసిన డైరెక్టర్ కూడా ఆయనే కావడం విశేషము. అందువల్లే మన తెలుగు సినిమా దర్శకులు ఆయనతో ఒక సినిమా చేస్తే వాళ్ళని వాళ్ళు మరొకసారి స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకోవచ్చనే ఉద్దేశ్యం తోనే ఆయన సినిమాల్లో నటించడానికి వీళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వెట్రి మారన్ మాత్రం తమిళ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    అది కూడా ధనుష్ ను హీరోగా పెట్టి ఆయనతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఆడుకాలం, వడ చెన్నై, అసురన్ లాంటి సినిమాలు భారీ సక్సెస్ లను సాధించాయి. వీరిద్దరి మధ్య వేవ్ లెంత్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వడంతో తన దగ్గర ఉన్న మంచి కథలను ధనుష్ తోనే చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…