Hair Transplant : ఎప్పుడో ముదిమి వయసులో ఊడాల్సిన జుట్టు.. అతడికి 26 సంవత్సరంలోనే ఊడిపోతోంది. జుట్టు రాలడంతో బట్టతల వస్తోంది. దీంతో అతడి అందం మొత్తం చెదిరిపోతుంది. ఈ క్రమంలో ఊడిపోతున్న జుట్టు స్థానంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలని భావించాడు. తన మునుపటి అందాన్ని పొందాలని అనుకున్నాడు. కానీ అతడు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. కాస్మెటిక్ సర్జరీ విఫలం కావడంతో అతడు చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే
మంగళూరులోని అక్కరెక్కరె ప్రాంతానికి చెందిన మహమ్మద్ మాజీ అనే యువకుడికి ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలిపోయే సమస్య ప్రారంభమైంది. దీంతో అతడు పలుమార్లు వైద్యులను సంప్రదించాడు. వాళ్లు పలు మందులను సూచించారు. వాటిని వాటిని వాడినప్పటికీ మాజీన్ తిరిగి జుట్టును పొందలేకపోయాడు. చివరి ప్రశ్నగా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా మంగళూరులోని బెండూర్వెల్ ప్రాంతంలోని ఒక క్లినిక్ ను సంప్రదించాడు. అక్కడ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకునేందుకు వైద్యులతో మాట్లాడాడు. ఫీజు విషయం కూడా చర్చించాడు. అంతా అయిపోయిన తర్వాత అతడికి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తుండగా మాజీన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో ఆ వైద్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. అయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని చెప్పిన నిపుణులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అందువల్లే మా కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ” మా కుమారుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు. జుట్టు రాలడం తప్ప అతడికి ఎలాంటి సమస్యలు లేవు. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ కు వెళ్లిన తర్వాత అనేక చర్చలు జరిపాడు. వారు నూటికి నూరు శాతం జుట్టు వస్తుందని హామీ ఇచ్చారు. ఉన్న జుట్టు ఊడిపోదని భరోసా ఇచ్చారు. దీంతో నా కుమారుడు ధైర్యంతో ఆ క్లినిక్ కు వెళ్లాడు. అని వారు నా కుమారుడి ప్రాణాలు తీశారు. ఆ కడుపుకోత ఎవరు తీర్చుతారు? మా కుమారుడికి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేయాలని భావించాం. అతడు జుట్టు ఊడిపోతుండడం వల్ల ఈ క్లినిక్ కు వచ్చాడు. తిరిగి జుట్టు వస్తుందని భావించాడు.. కానీ మమ్మల్ని వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు ఎంతటి నరకం అనుభవించాడో.. తలచుకుంటేనే భయం వేస్తోందని” మాజీన్ తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More