https://oktelugu.com/

Lok Sabha Elections 2024: మోదీపై ట్రాన్స్‌ జెండర్‌ పోటీ.. బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

మండలేశ్వర్‌ హేమంగి సఖీ సొంత రాష్ట్రం కూడా గుజరాతే. బరోడాలో జన్మించిన మహా మండలేశ్వర్‌ హిమంగి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 9, 2024 / 02:25 PM IST

    Lok Sabha Elections 2024

    Follow us on

    Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. తొలి విడత ఎన్నికలు మరో వారం రోజుల్లో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న వాయినాడ్‌పై ఉంది. మోదీ పోటీ చేస్తున్న వారణాని నుంచే ఓ ట్రాన్స్‌ జెండర్‌ బరిలో దిగారు. దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఆల్‌ ఇండియా భారత హిందూ మహాసభ అభ్యర్థిగా కిన్నార్‌ మహా మండలేశ్వర్‌ హిమంగి సఖీ బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వెల్లడించారు.

    ఎవరి మండలేశ్వర్‌..
    మండలేశ్వర్‌ హేమంగి సఖీ సొంత రాష్ట్రం కూడా గుజరాతే. బరోడాలో జన్మించిన మహా మండలేశ్వర్‌ హిమంగి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. హిమంగీ తండ్రి డిస్ట్రిబ్యూటర్‌ కావడంతో బరోడా నుంచి ముంబైకి మకాం మార్చారు. హిమంగీ పలు టీవీషోలలో చేశారు. ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తోన్న తొలి ట్రాన్స్‌ జెండర్‌ హింగీ సఖీ కావడం విశేషం. ఇక 2019 ఫిబ్రవరిలో ఆచార్య మహా మండలేశ్వర్‌గా పట్టాభిషేకం జరిగింది. అఖిల భారతీయ సాధు సమాజ్‌ భాగవత భూషణ్‌ మహా మండలేశ్వర్‌ బిరుదుతో సత్కరించింది.

    శ్రీకృష్ణుని భక్తురాలిగా..
    ఇక హేమంగి సఖీ శ్రీకృష్ణుని భక్తురాలు. భగవత్‌ కథలు, దేవి భగవత్‌ కథలు కూడా రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి హేమంగి సఖీ నుంచి గట్టి పోటీ ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అఖిల భారతీయ హిందూ మహాసభ మద్దతుతో మోదీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక వారణాసి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజయ్‌రాయ్‌ పోటీ చేస్తున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు ఆయన బలం సరిపోదని పేర్కొంటున్నారు.