Homeఅంతర్జాతీయంRishi Sunak: రుషి శునక్ విషయంలో ఓ సెక్షన్ అత్యుత్సాహం: ఇదీ తెలుసుకోవాల్సిన నిజం

Rishi Sunak: రుషి శునక్ విషయంలో ఓ సెక్షన్ అత్యుత్సాహం: ఇదీ తెలుసుకోవాల్సిన నిజం

Rishi Sunak: మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి. అర్థం ఓ తర్కంలో ఇమిడి ఉండాలి. ఇవేవీ లేకుంటే అభాసు పాలు కావడం ఖాయం. ప్రస్తుతం మన దేశంలో ఒక సెక్షన్ ప్రజలు కూడా ఇలాగే అభాసు పాలవుతున్నారు. భారత సంతతికి చెందిన రుషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకోగానే దేశంలోని కమ్యూనిస్టులు, లిబరల్స్ “ముస్లిం ఎందుకు భారత ప్రధాని కాకూడదు” అంటూ తెరపైకి కొత్త వాదన తీసుకొస్తున్నారు.
రిషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకున్నది ఒక ప్రత్యేకమయిన జాబ్ కోసం ! ప్రస్తుతం బ్రిటన్ లో నెలకొన్న ఆర్ధిక దుస్థితి ని గట్టెక్కించగలడు అనే విశ్వాసం తో.. రుషి శునక్ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువు కాబట్టి ప్రధానిగా ఎన్ని కవ్వలేదు ! రుషి శునక్ అనే అతను హిందువు అనేది యాదృచ్ఛికం మాత్రమే ! హిందువు అనేది అతని అర్హత కాదు. రుషి శునక్ మంచి ఆర్ధిక వేత్త కాబట్టి బ్రిటన్ ప్రస్తుత సమస్యకి పరిష్కారం చూపించగలడు అనే విశ్వాశం తో మాత్రమే ప్రధానిగా ఎన్నికయ్యాడు

Rishi Sunak
Rishi Sunak

రుషి శునక్ నేరుగా ప్రజలతో ఎన్నుకోబడలేదు

130 మంది పార్లమెంట్ సభ్యులు ఆయనని ఎన్నుకున్నారు !

బ్రిటన్ డెమోగ్రఫీ [జనాభా లెక్కలు] ప్రకారం..

2010- క్రిస్టియన్స్ 64% గా ఉండగా అది 2050 కి 45% గా ఉండవచ్చు. తరుగుదల 19% గా ఉన్నది. 2010లో ముస్లిమ్స్ 5% గా ఉండగా అది 2050 కి 11% గా ఉండవచ్చు. పెరుగుదల 6% గా ఉన్నది. 2010లో హిందువులు 1.4 % గా ఉండగా అది 2050 కి 2%గా ఉండవచ్చు. పెరుగుదల 0 .6%గా ఉన్నది. 2010లో యూదులు 0.5% గా ఉండగా అది 2050 లో 0.3% ఉండవచ్చు . తరుగుదల 0.2%గా ఉన్నది.
2010లో బౌద్ధులు 0.4%గా ఉండగా అది 2050 కి 0.9% గా ఉండవచ్చు. పెరుగుదల 0.5% గా ఉన్నది 2010లో జానపద మతాలు 0.1% గా ఉండగా అది 2050 కి 0.3% గా ఉండవచ్చు. పెరుగుదల 0.2%గా ఉన్నది. 2010లో ఏ మతము లేని వారు 28% గా ఉండగా అది 2050 కి 39%గా ఉండవచ్చు. పెరుగుదల 11%గా ఉంది.

బ్రిటన్ లో హిందువులు 1.4% గా ఉన్నారు కాబట్టి ఇదే సూత్రాన్ని భారత దేశంలో అప్లై చేద్దాం. ఈ సూత్రాన్ని భారత్ లో కనుక అప్లై చేయాలి అంటే సిక్కు మతస్థులని ప్రధానిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ పని మనం ఎప్పుడో చేశాం. 2004 నుంచి 2014 వరకు సిక్కు అయిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఆయనని వెనక ఉండి పాలిచించింది ఒక క్రైస్తవ మహిళ అయిన సోనియా !
భారత్ ఒక మైనారిటీ మతానికి [ట్రూ మైనారిటీ ] చెందిన సిక్కు కి ప్రధాని పదవి ని ఇచ్చింది అదీ 10 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు. నిజానికి మైనారిటీ అంటే ముందు 0.4 % గా ఉన్న జైనుల నుంచి ప్రధానిగా ఎన్నుకోవాలి. ఆ తరువాత 0.7%గా ఉన్న బౌద్ధుల నుంచి ఎవరో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోవాలి. లేదూ 2.3%గా ఉన్న క్రైస్తవుల నుంచి ఎవరినో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోవాలి కానీ హిందువుల తరువాత ఎక్కువ సంఖ్యలో ఉన్న ముస్లిమ్స్ 14.2% గా ఉన్నవాళ్ళ నుంచి ప్రధానిగా ఎందుకు ఎన్నుకోవాలి ?

భారత ప్రధాని పదవి అనేది రాజకీయ పరమయిన అత్యున్నత పదవి !
అదే భారత రాష్ట్రపతి అనే పదవి అత్యున్నత రాజ్యాంగ పదవి మన దేశంలో !
జాకీర్ హుస్సేన్, హీదాయుల్లా, అహ్మద్, జ్ఞాని జైల్ సింగ్, అబ్దుల్ కలాం లు రాష్ట్రపతి గా పనిచేశారు. నలుగురు ముస్లిమ్స్, ఒక సిక్కు .
మరి వివిధ రాష్ట్రాలలో ని ముఖ్యమంత్రి పదవి మాటేమిటి ? ఇది ఆడగకూడదు కదా ?
నాగాలాండ్,మిజోరాం లలో క్రైస్తవులు మెజారిటీ కదా ? అక్కడ హిందూ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి అని ఎందుకు డిమాండ్ చేయరు ? ఈ రెండు రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు కాదా ?

జమ్మూ & కాశ్మీర్ లో కేవలం 2.4% గా ఉన్న హిందువుల లో ఎవరన్నా ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేశారా ? లేదు. ఎందుకని జమ్మూ కాశ్మీర్ లో ఒక హిందువుని ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేయరు ?
పంజాబ్ లో మెజారిటీ గా సిక్కులు ఉన్నారు తరువాత హిందువులు ఉన్నారు. ఆ తరువాత ముస్లిమ్స్ ఉన్నారు. పంజాబ్ లో హిందువు లేదా ముస్లిం ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకోవడం లేదు ? పంజాబ్ లో డిమాండ్ చేయవచ్చు కదా ?

Rishi Sunak
Rishi Sunak

ఇప్పటివరకు జరిగింది ఏమిటంటే మెజారిటీ హిందువులు మైనారిటీని సంతృప్తిపరిచే భారాన్ని మోస్తూ వస్తున్నారు దశాబ్దాలుగా ! మైనారిటీ పేరుతో భారత్ ఇప్పటికీ రెండు ముక్కలయ్యింది. మళ్ళీ అదే మైనారిటీ కార్డ్ ని ఎలా వాడగలుగుతున్నారు ? హిందువుల తరువాత ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్ళని ఎలా మైనారిటీ అనగలగుతున్నారు? మైనారిటీ అంటే జైనులు,బౌద్ధులు,సిక్కులు కాదా ? పైన చెప్పిన మతాల కంటే పార్శీ లు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు మన దేశంలో శతాబ్దాలుగా ! అలాంటి పార్శీలు ఎవరూ మేము మైనారిటీలం కాబట్టి మాకు ఇది కావాలి అది కావాలి అని ఎప్పుడూ ఆడగలేదు.
ఈ వాదనలకు ముందు మైనారిటీ అనే పదానికి నిర్వచనం స్పష్టంగా చెప్పాలి అప్పుడే ఇలాంటి పస లేని సిద్ధాంతాల కి భవిష్యత్తులో చోటు ఉండదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular