Pawan Kalyan- Prabhas: రెండు బడా చిత్రాలకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ప్రభాస్ సలార్ చిత్రీకరణ అక్కడ జరుగుతుంది. దీంతో పవన్, ప్రభాస్ ఒక చోటకు చేరినట్లు అయ్యింది. హరి హర వీరమల్లు షూట్ కి చిన్న బ్రేక్ పడగా తిరిగి ప్రారంభించారు. అయితే తాజా షెడ్యూల్ ఇటీవల స్టార్ట్ చేశారు. దీని కోసం చిత్ర యూనిట్ కొన్ని రోజులు వర్క్ షాప్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తో పాటు నటీనటులు, యూనిట్ సభ్యులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. వర్క్ షాప్ ముగియగానే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ మొదలుపెట్టారు.

ఈ షెడ్యూల్ నందు పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. గుర్రపు స్వారీలతో కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజా షెడ్యూల్ రెండు వారాలకు పైగా జరిగే అవకాశం కలదు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఒక బస్తీ సెట్ ఏర్పాటు చేసిన యూనిట్ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ సైతం పాల్గొంటున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. కాంబినేషన్ రీత్యా సలార్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

హోంబలే ఫిలిమ్స్ ఖర్చుకు వెనుకాడకుండా సలార్ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ ఆదిపురుష్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన జరిగింది. 2023 జనవరి 12న మూవీ విడుదల చేయనున్నారు. అలాగే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూట్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.