
Contraceptive Pill : కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలే మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వీటి వల్ల ఏమవుతుందిలే అనుకున్నవే మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. పశువులు తినే దాణా తనను జైలుకు పంపిస్తుందని లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుని ఉంటాడా? మండే బొగ్గు తనను ఇబ్బంది పెడుతుందని శిబు సోరెన్ ఊహించి ఉంటాడా? కూరలో వేసుకునే ఉల్లిపాయ తమకు మూడోసారి అధికారం రాకుండా చేస్తుందని సోనియా గాంధీ కలలో అయినా అనుకుని ఉంటారా? లేదు కదా! మనం ఊహించనివి జరిగితేనే జీవితం అంటారు.. అలాంటి పరిణామాలు ఇప్పుడు అమెరికా వాసులకు వాస్తవంలోకి వస్తున్నాయి.. ఇందుకు కారణం ఒక మాత్ర.. ఆ మాత్ర ఇప్పుడు అమెరికా కోర్టులకు తలనొప్పులు తెస్తోంది.
అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి, పిల్లలపై తల్లిదండ్రుల అజమాయిషి తక్కువ ఉంటుంది కాబట్టి, యుక్త వయసులో వారు డేటింగ్ చేయడం, గర్భం దాల్చితే గర్భ నిరోధక మాత్రలు వాడటం అక్కడ సర్వసాధారణం.. ఇప్పుడు ఆ మాత్రలే అక్కడ సరికొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ అనేది చట్టరీత్యా నేరం.. కొన్ని రాష్ట్రాల్లో అయితే అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఉంది.. అయితే అక్కడ యువత ఎక్కువగా అబార్షన్ కోసం “మిఫిప్రాస్టాన్” అనే మాత్రలు వేసుకుంటారు. ఈ మాత్రలు వేసుకునే విధానంపై తాజాగా ఆ దేశంలోని రెండు కోర్టులు భిన్నమైన తీర్పులు వెలువరించాయి. టెక్సాస్ లోని ఫెడరల్ కోర్టు జడ్జి గర్భ నిరోధక మాత్రలపై నిషేధాన్ని ప్రకటించారు. మరో వైపు వాషింగ్టన్ కోర్టు మాత్రం అబార్షన్ పిల్స్ ను కనీసం 12 రాష్ట్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో గర్భ నిరోధక మాత్రలపై సందిగ్ధం నెలకొంది. మిసిస్ట్రోఫిన్ గురించి గత ఏడాది నుంచి అమెరికా కోర్టులో తీవ్రస్థాయిలో వాదనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 2020 సంవత్సరంలో సుమారు పది లక్షల మంది మహిళలు అబార్షన్ చేయించుకున్నారు.ఇందులో 53 శాతం మంది మిసిస్ట్రోఫిన్ తోనే తొలగించుకున్నారు. ఈ మాత్రల వినియోగం 2008లో 17 శాతం ఉండేది. 2017 నాటికి అది 39 శాతానికి పెరిగింది. ఫ్రాన్స్ లో 2020లో దాదాపు 70 శాతం అబార్షన్లు మెడికల్ ప్రక్రియలో జరిగాయి. అయితే ఇప్పుడు అదే రీతిలో అమెరికాలో కూడా గర్భాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.. దీనిపై కూడా అమెరికాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అబార్షన్ల ప్రక్రియ వల్ల యువత పెడదారులు పడుతోందని అమెరికన్ చట్టసభలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీని పై సమగ్రమైన చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాయి . యువత పెడధోరణి పట్టడం వల్ల అది దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పలు రాష్ట్రాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిసిస్ట్రోఫిన్ మాత్ర ను మహిళలు శృంగారం చేసిన తర్వాత గర్భం దాల్చకుండా ఉండేందుకు ఇవి వాడుతారు . మిసిస్ట్రోఫిన్ ను ఆర్ యూ 486 గా కూడా పిలుస్తారు. ఈ మాత్రలు వేసుకుంటే మహిళల శరీరంలో ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనివల్ల మహిళల్లో గర్భం రాదు.. ఇంకా కొంతమంది మిసోప్రోస్టాల్ అనే మాత్రను కూడా వేసుకుంటారు. శృంగారం తర్వాత 48 గంటలు దాటాక ఈ మాత్రను వాడుతారు. దీనివల్ల బ్లీడింగ్ జరిగి గర్భాశయ ప్రదేశం మొత్తం ఖాళీ అవుతుంది.ఈ మాత్రలను ఇంటి వద్దే వాడవచ్చు. పెద్దగా మెడికల్ సెట్టింగ్ అవసరం లేదు.
ఇక అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మిఫిస్ట్రాన్, మిసో ప్రోస్టోల్ కు 2000 సంవత్సరంలో అనుమతి ఇచ్చింది. గర్భం కన్ఫర్మ్ అయిన పది వారాల వ్యవధి వరకు ఈ మాత్రలు వాడవచ్చు. ఒకవేళ ఆ సమయం దాటిపోతే అప్పుడు వాక్యుం యాస్పిరేషన్ పద్ధతిలో గర్భాన్ని తొలగిస్తారు. అమెరికాలో అబార్షన్ ఖర్చు సగటున 580 డాలర్లు ఉంటుంది. కొన్నిచోట్ల అది ఎనిమిది వందల డాలర్లు కూడా ఉంటుంది. ఇక అబార్షన్ మాత్రలను నిర్దేశిత సమయం ప్రకారం తీసుకుంటే దానివల్ల సురక్షిత రీతిలో గర్భాన్ని తొలగించుకునే వీలుంటుంది. అబార్షన్ మాత్రలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి కూడా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం గర్భనిరోధకమాత్ర వాడిన 95% కేసుల్లో ప్రెగ్నెన్సీ అనేది దాదాపు టెర్మినేట్ అవుతుంది. కొన్ని కేసుల్లో మాత్రం అధికంగా బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంది. అమెరికాలో కనీసం 13 రాష్ట్రాల్లో అబార్షన్ మాత్రలపై నిషేధం విధించారు. రాజ్యాంగం ప్రకారం అబార్షన్ హక్కు ఉన్నప్పటికీ గత జూన్ నుంచి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ మాత్రలని అమ్మడం లేదు. ఇక చట్టపరమైన అనుమతి ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే మిఫిప్రిస్టోన్ మాత్రలు ఆన్లైన్లో అమ్ముతున్నారు.. ఫార్మసీలో అయితే ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఇస్తారు. అయితే ఈ గర్భనిరోధక మాత్ర ప్రస్తుతం అమెరికాలోని కోర్టులకు తలనొప్పులు తెప్పిస్తోంది. ఒక్కో కోర్టు ఒక్కో విధంగా తీర్పు చెప్పడంతో అక్కడ ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.