Homeక్రీడలుRavindra Jadeja Stunning Catch : రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్.. పెవిలియన్ కు చేరిన...

Ravindra Jadeja Stunning Catch : రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్.. పెవిలియన్ కు చేరిన గ్రీన్..!


Ravindra Jadeja Stunning Catch :
రవీంద్ర జడేజా.. ఇండియన్ క్రికెట్లో కీలక ప్లేయర్. ఆల్ రౌండర్ గా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లోను సత్తా చాటుతుంటాడు. ఆల్ రౌండర్ విభాగంలో టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను రవీంద్ర జడేజా విన్యాసాలు అన్ని ఇన్ని కావు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాధించిన అనేక విజయాల్లో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ లు ఉన్నాయి. ఫీల్డింగ్ లోను మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థులను అవుట్ చేస్తుంటాడు. శనివారం నాటి మ్యాచ్ లోనూ అటువంటి అద్భుత క్యాచ్ అందుకొని జడేజా ఔరా అనిపించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ జోరుగా సాగుతోంది. ఈ సీజన్లో మ్యాచ్ లు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి జట్టు బలంగానే కనిపిస్తుండడంతో.. ఏ జట్టుపై ఏ జట్టు విజయం సాధిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అన్ని జట్ల ప్లేయర్లు అదరగొడుతున్నారు. శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పట్టిన ఓ క్యాచ్ మొత్తం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. కామెరాన్ గ్రీన్ (12) రవీందర్ గడేజా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించాడు. 9వ రెండో బంతిని.. జడేజా తలపై నుంచి బౌండరీ వైపు బాధేందుకు గ్రీన్ యత్నించాడు. బలంగా కొట్టిన ఈ షాట్ కు బంతి వేగంగా రవీంద్ర జడేజా తలపై నుంచి వెళ్ళబోయింది. అయితే, కళ్ళు మూసి తలపై నుంచి వెళ్తున్న బంతిని రెండు చేతులతో పట్టుకున్నాడు. దీంతో కామెరూన్ గ్రీన్ ఊహించిన రీతిలో అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్యాచ్ పట్టే క్రమంలో జడేజా అదుపుతప్పి వెనక్కి పడబోయాడు. ఆ బంతిని బౌలర్ అందుకుంటాడని ఊహించని ఎంపైర్ కూడా.. తప్పించుకునేందుకు పక్కకు వంగిపోయాడు. అయితే అనూహ్యంగా రవీంద్ర జడేజా వేగంగా వెళుతున్న ఆ బంతిని అందుకుని ఔట్ చేశాడు.

ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించే రవీంద్ర జడేజా..

ఇండియన్ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా పేరుగాంచిన రవీంద్ర జడేజా.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కంటే.. ఫీల్డింగ్ విభాగంలో అద్భుతంగా రాణిస్తుంటాడు. గ్రౌండ్లో చిరుతలా కదులుతూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఫోర్లు, సిక్సులు వెళ్లాల్సిన చోట్ల కూడా మెరుపు వేగంతో డ్రైవ్ లు రవీంద్ర జడేజా అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో గొప్ప ఫీల్డర్ లో రవీంద్ర జడేజా ఒకడు అనడంలో ఎటువంటి సందేహము లేదన్నది క్రికెట్ అభిమానులు మాట. తాజాగా ముంబై తో మ్యాచ్ లో పట్టిన క్యాచ్ లు లాంటివి రవీంద్ర జడేజా కెరీర్లు ఎన్నో పట్టి ఉంటాడని అభిమానులు చెబుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular