Indore Airport Rat: ఎప్పుడైతే అహ్మదాబాద్ లో విమానం కుప్ప కూలిపోయిందో.. అప్పటినుంచి విమానాలు, విమానాశ్రయాలకు సంబంధించిన ఏదో ఒక సంఘటన దేశంలో సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇంజన్, ఇతర వైఫల్యాల వల్ల అర్ధాంతరంగా విమానాలను నిలిపివేయడం.. లేదా అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక విమానాశ్రయాలకు వెళ్లే వారికి కూడా వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. అటువంటి అనుభవమే ఇతడికి కూడా ఎదురయింది. దీంతో అతని వ్యవహారం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
అది మధ్యప్రదేశ్ రాష్ట్రం. అతని పేరు అరుణ్ మోది. అతడు బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుంటాడు. జీతం కూడా భారీగానే ఉంటుంది. ఇటీవల వ్యక్తిగత పని మీద అతడు ఇండోర్ వచ్చాడు. ఆ పని చూసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇండోర్ విమానాశ్రయం వెళ్ళాడు. అక్కడ తను ప్రయాణించే విమానం కోసం ఎదురుచూస్తున్నాడు. హాల్ లో కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలోనే అతని ప్యాంటులో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా భయపడ్డాడు. ఆ తర్వాత లోపల ఏదో ఉందని భావించి.. జిప్ తీసి చూడగా ఏదో జంతువులాగా అనిపించింది. భయపడిన అతడు వెంటనే వాష్ రూమ్ వెళ్ళాడు.
వాష్ రూమ్ వెళ్లిన తర్వాత జిప్ తీసి చూసి.. గట్టిగా పట్టుకున్నాడు.. అది విచిత్రమైన జంతువు కాదు. చిన్న ఎలక. అది అక్కడికి ఎలా వెళ్ళిందో తెలియదు. అతడు చూసుకోలేదా? లేదా విమానాశ్రయంలోనే వెళ్లిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియ రాలేదు గాని..ఆ ఎలుక మాత్రం అతని తొడను కరిచింది. పక్కనే తన భార్య ఉండడంతో ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత ఆ ఎలుకను అక్కడ డస్ట్ బిన్ లో పడేసి.. భార్యతో కలిసి బెంగళూరు విమానం ఎక్కాడు. బెంగళూరు వెళ్ళిన తర్వాత రేబిస్ ఇంజక్షన్ వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.