spot_img
Homeజాతీయ వార్తలుAyodhya Temple: 70 ఏళ్లుగా రామ మందిరాన్ని వ్యతిరేకించిన కుటుంబం.. ఆయినా ప్రారంభానికి ఆహ్వానం!

Ayodhya Temple: 70 ఏళ్లుగా రామ మందిరాన్ని వ్యతిరేకించిన కుటుంబం.. ఆయినా ప్రారంభానికి ఆహ్వానం!

Ayodhya Temple: అంతా రామమయం.. దేశమంతా రామ నామస్మరణ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించే. ఏ టీవీ చానెల్‌ పెట్టినా రామాలయ నిర్మాణ ప్రత్యేకతల గురించే. ఏ పత్రిక చదివినా రామాలయం నిర్మాణ విశేషాలే. అయితే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలపాటు కోర్టుల్లో వాదనలు జరిగాయి. చివరకు భవ్య రామ మందిర నిర్మాణం కల సాకారం కాబోతోంది. జనవరి 22న నిర్వహించే రామమందిర ఆలయ ప్రారంభోత్సవానికి ట్రస్టు వాళ్లు అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబానికి ఆహ్వానం పంపించడం ఇప్పుడు వార్త అయింది. ఎందుకంటే.. ఆ కుటుంబం 70 ఏళ్లుగా రామమందిర నిర్మాణాన్ని కోర్టుల్లో వ్యతిరేకించింది. అయినా రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్టు వారు రామాలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం పలికారు.

జనవరి 22న ప్రారంభోత్సవం..
మరోవైపు అయోధ్య రామాలయాన్ని జనవరి 22న ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రాం లల్లా విగ్రహ ప్రతిష్ట జరుగనుంది. ఈమేరకు దేశవ్యాప్తంగా అతిథులను ఆహ్వానిస్తున్న తీర్థక్షేత్ర ట్రస్టు.. ఇందుకు ప్రత్యేక ఆహ్వాన పత్రికలను కూడా సిద్ధం చేసింది. ఈ క్రమంలో రామమందిర ట్రస్ట్‌ బాబ్రీ మసీదుకు మాజీ పార్టీ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్‌ అన్సారీకి కూడా ట్రస్టు ఆహ్వానం పంపించింది. ఆలయానికి భూమి పూజ సమయంలో కూడా అన్సారీని ఆహ్వానించారు.

1949 నుంచి కేసు వాదిస్తున్నా..
రామజన్మభూమి–బాబ్రీ మసీదు వాది హషీం అన్సారీ 1949 నుంచి ఈ కేసును వాదిస్తున్నారు. అయినా అతడు హిందువులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వివాదాస్పద స్థలం కోసం ఇతర ప్రధాన పోటీదారులలో నిర్మోహి అఖారాకు చెందిన రామ్‌కేవల్‌ దాస్, దిగంబర్‌ అఖారాకు చెందిన రామచంద్ర పరమహంస్‌తో హషీంకు చివరి వరకు సన్నిహిత స్నేహం ఉంది. హషీం అన్సారీ మరణానంతరం ఆయన కుమారుడు ఇక్బాల్‌ అన్సారీ బాబ్రీ మసీదు పక్షాన్ని కోర్టులో సమర్పించారు. 2019, నవంబర్‌ 9న సుప్రీంకోర్టు రామాలయానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఆహ్వానంపై అన్సారీ హర్షం..
రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు తనకు ఆహ్వానం అందడంపై ఇక్బాల్‌ అన్సారీ ఆనందం వ్యక్తం చేశాడు. లార్డ్‌ రాం లల్లా ప్రాంగణానికి వెళ్లి ప్రతిష్టలో పాల్గొంటానని చెప్పారు. అయోధ్యకు వచ్చే అతిథులను స్వాగతం పలకడం కూడా మన ధర్మమేనని పేర్కొన్నారు. తనకు ప్రధాని మోదీని కలవాలని ఉందని అన్సారీ అన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version