2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనదే హవా…. ఆ రెండు పార్టీలకు షాక్?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమ పాలనతో రోజురోజుకు ప్రజల్లో మద్దతు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్ లో గడిచిన ఆరేళ్ల మోదీ సర్కార్ పాలన న భూతో న భవిష్యతి అనే చెప్పాలి. ఆరేళ్ల పాలనలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ క్లిష్టమైన సమస్యలు ఎదురైనా ఆ సమస్యలకు వీలైనంత తక్కువ సమయంలో పరిష్కార మార్గాలను చూపుతూ ప్రజలకు మరింత చేరువవుతోంది. తెలంగాణలో ఇప్పటికే బలపడిన బీజేపీ ఏపీలో కూడా బలపడే […]

Written By: Navya, Updated On : September 17, 2020 8:59 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమ పాలనతో రోజురోజుకు ప్రజల్లో మద్దతు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్ లో గడిచిన ఆరేళ్ల మోదీ సర్కార్ పాలన న భూతో న భవిష్యతి అనే చెప్పాలి. ఆరేళ్ల పాలనలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ క్లిష్టమైన సమస్యలు ఎదురైనా ఆ సమస్యలకు వీలైనంత తక్కువ సమయంలో పరిష్కార మార్గాలను చూపుతూ ప్రజలకు మరింత చేరువవుతోంది.

తెలంగాణలో ఇప్పటికే బలపడిన బీజేపీ ఏపీలో కూడా బలపడే దిశగా అడుగులు వేస్తోంది. జనసేనతో బీజేపీ పొత్తు ఇరు పార్టీలకు ప్లస్ అవుతోంది. ఏపీలో రోజురోజుకు జనసేన కూడా బలపడుతూ ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలకు షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జనసేనల మద్దతు వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది.

ఈ రెండు పార్టీలు మద్దతు ఇవ్వకపోయి ఉంటే టీడీపీ 2014 ఎన్నికల్లోనే ఘోర పరాజయం చవిచూసేది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించలేకపోయినా 7 శాతం ఓట్లను పొందింది. సొంతంగా పోటీ చేసిన తొలిసారే ఈ స్థాయిలో ఓట్ల శాతం పొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. బీజేపీ జనసేన 2024 ఎన్నికలే టార్గెట్ గా పార్టీల బలోపేతంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే రాష్ట్రంలో బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రభావం చూపే కార్యకర్తలను, నేతలను నియమించుకుని వాళ్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్త వహిస్తూ ముందుకెళితే విజయం తథ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రజలు ప్రస్తుతం టీడీపీని నమ్మే పరిస్థితుల్లో లేరు. వైసీపీ పాలన అంత గొప్పగా లేదు. దీంతో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు సైతం అవినీతి మరకలు లేని బీజేపీ జనసేన కూటమికే మొగ్గు చూపే అవకాశం ఉంది.