2000 Notes: అప్పట్లో పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరపైకి 2000 నోటు తీసుకొచ్చింది. అయితే దీని ద్వారా ఆశించినంత స్థాయిలో నల్లధనానికి అడ్డుకట్ట వేయడం కుదరడం లేదని భావించి.. వ్యూహాత్మకంగా 2000 నోటును తగ్గించడం ప్రారంభించింది. అలా అలా దాదాపుగా రద్దు చేసింది. గత ఏడాది 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించింది. సెప్టెంబర్ 30, 2023 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ప్రజలకు రిజర్వ్ బ్యాంకు సూచనలు చేసింది. అనంతరం అక్టోబర్ 7, 2023 వరకు గడువు పొడిగించింది. ఆ తర్వాత కూడా బ్రాంచ్ లలో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం వంటి సదుపాయాన్ని నిలిపివేసింది. అంతేకాదు అక్టోబర్ 8, 2023 నుంచి దేశంలోని 19 బ్యాంక్ కార్యాలయాల్లో 2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.69% 2000 నోట్లు తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది.. ఇప్పటికీ దేశ ప్రజల వద్ద 8,202 కోట్ల విలువైన విలువైన రెండు వేల నోట్లు ఉన్నాయని తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. 2000 నోటుకు సంబంధించి ఉపసంహరణ ప్రకటన వెల్లడైనప్పుడు మే 19, 2023న చెల్లుబాటులో ఉన్న 2000 నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లుగా ఉన్నట్టు సమాచారం. మార్చి 2024 నాటికి అది 8,202 కోట్లకు తగ్గినట్టు తెలుస్తోంది.
ఇక 2000 నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు ఇండియా పోస్ట్ ద్వారా ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే 19 కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భువనేశ్వర్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం లోని రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్లు డిపాజిట్ లేదా మార్చుకునే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు 2000 నోటు చెల్లుబాటు కాదని వదంతులు కొంతమంది వ్యాప్ చేస్తున్నారని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని రిజర్వ్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారమే 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వర్గాలు చెబుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More