https://oktelugu.com/

900 టీఎంసీల నీరు వృథా.. ఇదీ మన వ్యథ!

కృష్ణా నది తెలంగాణ- రాయలసీమ మధ్య ప్రవహిస్తోంది. దక్షిణ తెలంగాణ , రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. రెండు ప్రాంతాలు పరస్పర సహకారంతో ప్రాజెక్టులను ఇచ్చిపుచ్చుకునే పద్ధ‌తిలో నిర్మించుకుంటే ఇలాంటి వర్షకాలంలో సముద్రంలోనే కలిసే వందల టీఎంసీల నీటిని పొలాలకు తరలించి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు.. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వెనుకబడిన ప్రాంతాల మధ్య విభజన వాదాలు తెస్తున్న పార్టీలు ఈ వర్షాలకు వృథాగా పోయిన 900 టీఎంసీల గురించి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 17, 2020 / 04:39 PM IST
    Follow us on

    కృష్ణా నది తెలంగాణ- రాయలసీమ మధ్య ప్రవహిస్తోంది. దక్షిణ తెలంగాణ , రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. రెండు ప్రాంతాలు పరస్పర సహకారంతో ప్రాజెక్టులను ఇచ్చిపుచ్చుకునే పద్ధ‌తిలో నిర్మించుకుంటే ఇలాంటి వర్షకాలంలో సముద్రంలోనే కలిసే వందల టీఎంసీల నీటిని పొలాలకు తరలించి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవచ్చు.. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వెనుకబడిన ప్రాంతాల మధ్య విభజన వాదాలు తెస్తున్న పార్టీలు ఈ వర్షాలకు వృథాగా పోయిన 900 టీఎంసీల గురించి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

    Also Read: జనసేనాని.. బయటకు రావాల్సిందేనా?

    కృష్ణా నది నుంచి తాజాగా వర్షాలకు 900 టీఎంసీలు వృథాగా కడలి పాలయ్యాయి. రాయలసీమ కరువును ఇందులో పావు వంతు నీటితో తీర్చవచ్చు. అయినా కూడా పంతాలతో వృథా చేస్తున్నారు. కృష్ణా నది నీరు వృథాగా పోవడం  ఎవరికీ లాభం కాదు..  రాయలసీమ , దక్షిణ తెలంగాణ ఇప్పటికే నష్టపోయిన ప్రాంతాలు. వాటికి పంచేలా నేతలు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది.

    కృష్ణా నదికి తాజాగా భారీగా వరద వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలశయానికి వరద పోటెత్తుతోంది. ఏకంగా 6.53 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. నాగార్జున సాగర్ నుంచి కూడా 4.34 లక్షల క్యూసెక్కులను ఇన్ ఫ్లో వదిలారు. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి 4.92 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక ప్రకాశం బ్యారేజీకి ఈ నీరంతా పోటెత్తడంతో అక్కడి నుంచి 6 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

    Also Read: పెద్ద స్కెచ్: జగన్‌ ఓటు బ్యాంకు పాలిటిక్స్‌?

    గత నాలుగు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 180 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోయాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటిదాకా దాదాపు 900 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందన్నారు. ఇంతటి నీరు గనుక రాయలసీమ, తెలంగాణ వాడుకుంటే నిజంగానే సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడంటే వానలు పడ్డాయి. కానీ పడనప్పుడు ఈ నీరు ఎంతో విలువైనది. ముఖ్యంగా సీమలో తక్కువగానే వర్షం పడింది. అక్కడికి ఈ నీరు తరలించినా సీమ వాసుల గొంతులు తడిచేవి. వారి కరువు తీరేది. నేతలు పట్టింపులు మాని ఈ వృథాగా సముద్రంలో కలిసే నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తే రెండు రాష్ట్రాలకు మంచిది.