https://oktelugu.com/

New Medical Colleges In Telangana: తెలంగాణా చరిత్రలో కొత్త అధ్యాయం..!

New Medical Colleges In Telangana: తెలంగాణ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మంగళవారం ఆవిష్కృతమైంది. 8 కొత్త మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్యరంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్‌ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే పనిలేకుండా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలను నిర్మించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 15, 2022 / 02:49 PM IST
    Follow us on

    New Medical Colleges In Telangana: తెలంగాణ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మంగళవారం ఆవిష్కృతమైంది. 8 కొత్త మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్యరంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న కేసీఆర్‌ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే పనిలేకుండా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలను నిర్మించి వైద్య విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు.

    KCR

    జిల్లాకో వైద్య కళాశాల..
    రాష్ట్రంలోఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ప్రారంభించిన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లోనూ కొత్త మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య విద్య కోసం విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే సరిపడా సీట్లు ఉంటాయని స్పష్టం చేశారు. తాజాగా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలో ఈకళాశాలలు ఏర్పాటయ్యాయి. ఈ కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభించిన కేసీఆర్‌ తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయంగా అభివర్ణించారు. తెలంగాణ దేశానికి మార్గదర్శకం కాబోతుందని వెల్లడించారు.

    నాలుగు రెట్లు పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లుల..
    మారుమూల ప్రాంతాలలో కూడా మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు అవుతాయని తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించలేదని పేర్కొన్న కేసీఆర్‌ కొత్త మెడికల్‌ కళాశాలలను తీసుకురావడానికి మంత్రి హరీశ్‌రావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. 8 కొత్త మెడికల్‌ కళాశాలను ప్రారంభించడం గర్వంగా ఉందని తెలిపారు. నిన్నటి వరకు తెలంగాణలో 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవని, ఇప్పుడు 2,790 సీట్లకు పెంచుకోగలిగామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎంబీబీఎస్‌ సీట్లు నాలుగు రెట్లు అయ్యాయని తెలిపారు. ఇక పీజీ సీట్లు కూడా 1,180 కి చేరి రెట్టింపయ్యాయి అని పేర్కొన్నారు.

    KCR

    33 మెడికల్, నర్సింగ్‌ కళాశాలలను నిర్మిస్తాం
    ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్, నర్సింగ్‌ కళాశాలలను నిర్మిస్తామని పేర్కొన్న కేసీఆర్‌ రాష్ట్రంలో వైద్యరంగాన్ని పటిష్టం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

    Tags