
ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్ల నుంచి ముసలివాళ్ల వరకు అందరినీ మోకాళ్ల నొప్పుల సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్య వల్ల చాలామంది పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఎన్ని మందులు వాడినా మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రమవుతోందే తప్ప తగ్గడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ప్లేట్ లెట్ రిట్ చికిత్స ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
Also Read: చలికాలంలో జామకాయలు తింటే ఆ సమస్యకు చెక్..?
రోగి రక్తంలొని ప్లాస్మాను సేకరించి మోకాలు భాగంలో ప్రవేశపెట్టి చికిత్స చేయించడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎక్కువగా తాము మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధ పడుతున్నామని ఈ సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని తెలుపుతున్నారు. మృదులాస్థి అరిగిపోవడం వల్ల ఎక్కువమంది ఈ సమస్య బారిన పడుతున్నారు.
నడిచే సమయంలో, మెట్లు ఎక్కే సమయంలో ఈ సమస్యతో బాధ పడుతున్న వారిలో భరించలేని స్థాయిలో నొప్పి ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఈ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగేలా చేసినా వీటి వల్ల కిడ్నీలకు హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స వల్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. చాలామంది మోకాళ్ల నొప్పుల సమస్య పరిష్కారం కోసం ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.
Also Read: మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్య వచ్చే అవకాశం..?
అయితే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స ద్వార ఆపరేషన్ అవసరం లేకుందానే సమస్యకు పరిష్కారం దొరికే విధంగా చేస్తోంది. ఈ చికిత్స ద్వారా దెబ్బతిన్న కణజాలంలో మార్పులు జరుగుతాయి. దెబ్బతిన్న కణజాలం కాస్తా ఆరోగ్యకరమైన కణజాలంగా మారుతుంది. మూడు నెలల సమయంలో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది.