ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..!

విజయవాడ నగరంలో ఈ తెల్లవారుజామున దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగటంతో కోవిడ్ రోగులు కొందరు మృతి చెందారు. ప్రముఖ హృద్రోగ నిపుణులు రమేష్ కుమార్ కు చెందిన రమేష్ హాస్పటల్, పాత బస్టాండ్ సమీపంలోని స్వర్ణ పాలెస్ హోటల్ ను అద్దెకు తీసుకుని కోవిడ్ ఆసుపత్రిగా మార్చింది. ఈ ఆసుపత్రిలో కొంత కాలంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ఆసుప్రతిలో […]

Written By: Neelambaram, Updated On : August 9, 2020 11:43 am
Follow us on


విజయవాడ నగరంలో ఈ తెల్లవారుజామున దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగటంతో కోవిడ్ రోగులు కొందరు మృతి చెందారు. ప్రముఖ హృద్రోగ నిపుణులు రమేష్ కుమార్ కు చెందిన రమేష్ హాస్పటల్, పాత బస్టాండ్ సమీపంలోని స్వర్ణ పాలెస్ హోటల్ ను అద్దెకు తీసుకుని కోవిడ్ ఆసుపత్రిగా మార్చింది. ఈ ఆసుపత్రిలో కొంత కాలంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ఆసుప్రతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో లోపల ఉన్న పర్నీచర్ అగ్నికి ఆహుతయ్యింది. ఫలితంగా పొగ వ్యాప్తి చెందడంతో మొత్తం ఏడుగురు కరోనా రోగులు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: మూడు రాజధానులకు ముహూర్తం ఖరారు..!

ప్రమాద సమచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ లు ఏర్పాటు చేసి రోగులకు ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో ఎంత మంది కారోనా రోగులు చికిత్స పొందుతున్నారు, ఇతరులు ఎంత మంది ఉన్నారు వివరాలు సేకరించి వారందరి ఆచూకి కోసం చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి విద్యుత్ షార్టు సర్య్కూట్ అవడమే కారణంగా పోలీసులు ప్రాధమిక విచారణలో స్పష్టం అవుతుంది. ప్రమాదం జరిగే సమయానికి ఆసుపత్రిలో 30 మంది వరకూ రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మాత్రం కేవలం ఐదుగురు రోగులే ఉన్నట్లు తెలిసింది. కావాలనే రోగుల సమాచారం ప్రభుత్వానికి అందించలేదని తెలుస్తోంది. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ప్రధాని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు, దురదృష్టవశాత్తు కొందరు మృతి చెందారని వీరికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించినట్లు ప్రధానికి సిఎం వివరించారు. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మరోవైపు పలు పార్టీల నాయకులు ఈ ప్రమాదంపై స్పందించారు.

Also Read: వాలంటీర్ల వ్యవస్థపై ఏంపీ రఘురామ ఏమన్నారంటే?

నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ భవనం చాలా పాతది. చల్లపల్లి రాజులకు సంబంధించిన భవనం కావడంతో ఈ సెంటర్ కు చల్లపల్లి బంగ్లా సెంటర్ అనే పేరొచ్చింది. ఈ బంగ్లాను కాలక్రమంలో ఇతర వ్యాపారులు కొనుగోలు చేసి రీమోడల్ చేసి హోటల్ గా మార్చారు. ఈ హోటల్ ను కొన్నేళ్ల కిందట ప్రముఖ సినీనటుడు కోనుగోలు చేసినట్లు సమాచారం. ఇంత పాత హోటల్ లో ఆసుపత్రి ఏర్పాటు చేయడంపై సరైన చర్య కాదనే విమర్శలు వస్తున్నాయి.