‘పీఎస్‌వీ గరుడ వేగ’ మూవీతో వెండితెరపై కొత్త లైఫ్ ప్రారంభించాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, కుటుంబ ప్రేక్షకులు విపరీతంగా ఆరాధించే హీరోగా పేరు తెచ్చుకున్న అతను చాన్నాళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు. రీమేక్ మూవీస్, ఒకే తరహా చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. కానీ, కొంత గ్యాప్ తీసుకొని, లుక్ మార్చుకొని 2017లో గరుడవేగతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ మూవీ అనూహ్య విజయం సాధించడంతో రాజశేఖర్ లైఫ్ టర్న్ అయింది. లాస్ట్ ఇయర్ ‘కల్కి’తో పలుకరించాడు. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయిన ఆ మూవీ విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ రెండు మూవీస్‌ను అతను కొత్త దర్శకులతో తీయడం విశేషం. అంతకుముందు ‘గుంటూర్ టాకీస్’ వంటి అడల్ట్ మూవీ చేసిన ప్రవీణ్ సత్తారుకు చాన్స్ ఇవ్వగా అతను గరుడ వేగతో రాజశేఖర్ కు హిట్ ఇచ్చాడు. ఇక, ‘అ’తో మెప్పించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ‘కల్కి’లో రాజశేఖర్ ను డిఫరెంట్ లుక్‌లో చూపించాడు.
Also Read: నాని హీరోయిన్‌కు బంపరాఫర్!
లాక్‌డౌన్ బ్రేక్‌లో పలు ఇంట్రస్టింగ్ కథలు విన్న రాజశేఖర్ తన తదుపరి చిత్రాన్ని ఓ సీనియర్ దర్శకుడితో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు నీలకంఠ. షో, మిస్సమ్మ , విరోధి మూవీస్‌తో ఐదు నంది అవార్డులు సాధించిన నీలకంఠకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. వాటి తర్వాత ఆయన చేసిన చిత్రాలు ఆడలేదు. 2013లో వచ్చిన చమ్మక్ చల్లో, ఆ తర్వాత ఏడాదికి రిలీజైన మాయ బోల్తా కొట్టాయి. ఆపై, హిందీ సూపర్ హిట్ మూవీ క్వీన్‌ను మలయాళంలో ‘జామ్ జామ్’ పేరుతో రీమేక్ చేశాడు. షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే, దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఆయన టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వాలని డిసైటయ్యాడు. ఈ క్రమంలో రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ రెడీ చేసి అతనికి నెరేట్ చేశాడని సమాచారం. కథ నచ్చడంతో సీనియర్ హీరో కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. నీలకంఠ- రాజశేఖర్ ఫిల్మ్ గురించి తొందర్లోనే అనౌన్స్‌మెంట్ రానుంది.