
విశాఖ లోని ఎల్.జి ప్రరిశ్రమలో చోటు చేసుకున్న విధంగానే లాక్ డౌన్ అనంతరం పరిశ్రమలో పనులు ప్రారంభిస్తుండగా ప్రమాదకర వాయువులు వెలువడిన సంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఒక పేపర్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన వాయువు వెలువడింది.
రాష్ట్రంలో ఉన్న రాయ్ గర్ జిల్లాలోని తెట్ల గ్రామంలో శక్తి పేపర్ మిల్లును లాక్ డౌన్ మినహాయింపు కారణంగా గురువారం పునఃప్రారంభించారు. ప్లాంట్ క్లినింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదకర వాయువు విడుదల కావడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని జిల్లా ఎస్పీ దీపాన్షు కబ్రా వెల్లడించారు. కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని రాయ్ గర్ ఆసుపత్రికి తరలించారు.