5G Revolution: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంలో ఐదవ తరం టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. పాములాడించే దేశమని గేలి చేసిన వారితోనే.. సాంకేతిక పరిజ్ఞానంలో పోటీ పడలేమనే స్థాయికి ఎదిగాం. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ఐదవ తరం టెలికాం సేవలను ప్రారంభించారు. మొదట ఈ సేవలు మెట్రో నగరాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఐదవతరం టెలికాం సేవలను ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్లో ఎలా పొందాలి? 5జీ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వీటిపై విశ్లేషణాత్మకమైన కథనం ఇది. స్కిప్ చేయకుండా చదవండి.

_ ఎయిర్ వేవ్ లు సిద్దం చేసుకుంటున్నాయి
భారత్ కు, స్వీడన్ కు దూరం కొన్ని వేల మైళ్ళు. ఇక్కడే ఉండి అక్కడ ఒక కారుని నడపడం సాధ్యమేనా? ఇదేమన్నా విఠలాచార్య సినిమా కాదు బాస్! వాస్తవంలోకి రండి అంటున్నారా? మేము ఉన్నదే చెప్పాం. అవును నిన్న మెడీ 5 జీ టెక్నాలజీతో ఢిల్లీలోనే ఉండి స్వీడన్లో కారును ఆపరేట్ చేశారు. టెక్నాలజీ వల్ల ఎంత ప్రయోజనం ఉందో ఈ చిన్న సంఘటన చాలు అనుకుంటా! ఇక ఐదోతరం టెలికం సేవలు అందుబాటులోకి రావడంతో సర్వీస్ ప్రొవైడర్లు తమ 5G లాంచ్ ప్లాన్‌లను పటిష్టం చేసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వారికి అవసరమైన ఎయిర్‌వేవ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వినియోగదారులు కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే 5జీ ని సపోర్ట్ చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి.
ఇటీవల, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, అలాగే అదానీ డేటా నెట్‌వర్క్‌లతో సహా టెల్కోలు ముందస్తు చెల్లింపులు, మొదటి-సంవత్సర వాయిదాలు 17,855 కోట్లను బదిలీ చేసిన ఒక రోజు తర్వాత, ఆగస్టు 18, 2022న ఎయిర్ వేవ్ లను కేటాయించింది.
5జీని సపోర్ట్ చేస్తుందో తెలుసుకోండి
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 5జీని సపోర్టు చేస్తుందో లేదో పరిశీలించేందుకు ఇలా చేసి చూడండి.
దశ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లండి.
దశ 2: “వై పై, నెట్‌వర్క్” ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 3: సిమ్, నెట్‌వర్క్” ఎంపికపై క్లిక్ చేయండి.
దశ 4; ప్రాధాన్య నెట్‌వర్క్ రకం” ఎంపిక క్రింద ఉన్న అన్ని సాంకేతికతల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 5: ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ 5జీకి మద్దతు ఇస్తే, అది 2జీ/3జీ/4జీ/5జీగా జాబితా చేయబడుతుంది.
5 జీ పై ఎవరు ఏమంటున్నారంటే
కేంద్రం వేగవంతమైన క్లియరెన్స్‌ను భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ప్రశంసించారు. “నో ఫస్, నో ఫాలో అప్, కారిడార్ల చుట్టూ పరుగెత్తడం లేదు. పెద్ద వాదనలు లేవు. ఇది పూర్తి కీర్తితో పనిలో వ్యాపారం చేయడం సౌలభ్యం” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. “టెలికమ్యూనికేషన్స్ విభాగంతో నా 30 సంవత్సరాలకు పైగా మొదటి అనుభవంలో, ఇది మొదటిది! వ్యాపారం అలాగే ఉండాలి. నాయకత్వం పనిలో-టెలికాం అగ్రస్థానంలో, అధికారంలో ఉంది. ఎంత మార్పు! ఈ దేశాన్ని మార్చగల మార్పు – అభివృద్ధి చెందిన దేశంగా దాని కలలకు శక్తినిస్తుంది.”
స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్ జారీ చేశాం. 5జీ లాంచ్‌కు సిద్ధం కావాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరుతున్నా’’ అని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

అప్పట్లో మోదీ ఏమన్నారంటే
అంతేకాకుండా, ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశంలో 5జీ నెట్‌వర్క్ గురించి మాట్లాడారు. 5జీ మొబైల్ సేవలు భారతదేశంలో ప్రారంభమవుతాయని వివరించారు. నాటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ‘మేడ్-ఇన్-ఇండియా’ సాంకేతికత కొత్త భారతదేశ సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. తొలిసారిగా భారత్‌లోని టెక్‌కేడ్, డిజిటల్ టెక్నాలజీ ప్రతి రంగంలోనూ సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. అన్నట్టుగానే తీసుకువచ్చారు. భారత్ లో ఉండి స్వీడన్ లో కారు నడిపారు. పాములు ఆడించే దేశం అన్న వారితోనే, నిలబడి చప్పట్లు కొట్టించారు.