YCP-Ipac Surgery: రాష్ట్రంలో 110 స్థానాల్లో వైసిపి బలంగా ఉందా? ఐపాక్ సర్వే ఇదే చెబుతుందా? ఈపాటికే జగన్ కు సర్వే నివేదిక అందించిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మొన్నటివరకు 175 నియోజకవర్గాలకు 175 గెలుచుకుంటామన్న వైసీపీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ 60 స్థానాలు తగ్గడం విశేషం. వైసిపి హై కమాండ్ కు కలవరపాటుకు గురిచేసే అంశం.
మొన్నటికి మొన్న కొన్ని సర్వేల్లో వైసిపి ఏకపక్ష విజయం సాధిస్తుందని ప్రచారంతో హోరెత్తించారు. ఐపాక్ నివేదికలో 60 సీట్లు తగ్గడం విశేషం.ప్రధానంగా గోదావరి జిల్లాల్లో వైసీపీకి జనసేన రూపంలో ఓటమి తప్పదని ఐపాక్ గుర్తించడం విశేషం. ఈ నేపథ్యంలో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాలో జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు సమాచారం.
అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో వైసిపి పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గ్రామీణ స్థాయిలో సానుకూలత వ్యక్తం అవుతున్నప్పటికీ మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలు కంటే అభివృద్ధి కోరుకున్న వారు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో సైతం గతం కంటే సంతృప్తి స్థాయి తగ్గింది. ఐ ప్యాక్ ఇదే ప్రధానంగా గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఎలా ముందుకెళ్లాలో జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో వైసీపీకి దారుణ పరాభవం తప్పదని గుర్తించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో సైతం మెజారిటీ స్థానాలు వైసిపి కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 170 స్థానాలు గెలుస్తామని దీమా వ్యక్తం చేస్తూ వస్తున్న వైసిపి ఇప్పుడు ఇప్పుడు 110 స్థానాలకు పడిపోవడం పార్టీ శ్రేణులను కాస్త భయం గొలుపుతోంది. ఐపాక్ అనేది వైసిపి సొంత సంస్థ. ఆ సంస్థ సర్వేలోనే వైసిపి గతం కంటే వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు విపక్షాల మధ్య పొత్తుల అంశం ఇంకా కుదరలేదు. అదే జరిగితే రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లో ఉందని వైసిపి వర్గాలు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తున్నాయి.