మరో ఐదుగురు పవన్ కళ్యాణ్ అభిమానులు మృతి..! 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకుంటూ అతని అభిమానులంతా ఈ రోజున వేడుకలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఆ వేడుకలు కాస్తా వారి జీవితాలకు సంకటంగా మారాయి. నిన్న రాత్రి ముగ్గురు యువకులు పవర్ స్టార్ బ్యానర్ ను కడుతూ కరెంటు తీగలు పట్టుకొని చనిపోగా…. తెల్లవారుజామున వరంగల్ రూరల్ దామెర మండలం పసరగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక కారు […]

Written By: Navya, Updated On : September 3, 2020 10:32 am
Follow us on

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని పురస్కరించుకుంటూ అతని అభిమానులంతా ఈ రోజున వేడుకలు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల ఆ వేడుకలు కాస్తా వారి జీవితాలకు సంకటంగా మారాయి. నిన్న రాత్రి ముగ్గురు యువకులు పవర్ స్టార్ బ్యానర్ ను కడుతూ కరెంటు తీగలు పట్టుకొని చనిపోగా…. తెల్లవారుజామున వరంగల్ రూరల్ దామెర మండలం పసరగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. 

Also Read : కుప్పంలోని బాధిత కుటుంబాలను కలవనున్న పవన్ కళ్యాణ్?

ఇక లారీ, కారు రెండు ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది. ఆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా వరంగల్ జిల్లా పోచం మైదాన్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే చనిపోయిన ఐదుగురు పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు వస్తున్నాయి. వీరందరూ పవర్ స్టార్ అభిమానులని…. అత్యుత్సాహంతో వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారు పొరపాటున లారీని ఢీ కొట్టారని చెబుతున్నారు. 

మరణించినవారు మేకల రమేష్, మేడి చందు, రోహిత్, పవన్, సాబిర్ లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడున్నట్లు ఉన్నత అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన స్థలం వద్దకు హుటాహుటిన వచ్చిన ఏసిపి శ్రీనివాస్ సిబ్బందితో కలిసి అక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కానీ అప్పటికే ఫలితం లేకుండా పోయింది. 

ఇక ఈ విషయమై వారు జనసేన అభిమానులని పవన్ కళ్యాణ్ నుండి గాని, అతని పార్టీ తరఫు నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే నలుగురు యువకులు పైన చెప్పబడిన కరెంట్ షాక్ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్న దశలో ఇలా మరో ఐదుగురు మృతి చెందడం నిజంగా బాధించే విషయం.

Also Read : ట్విస్ట్: వదలని జగన్.. మళ్లీ హైకోర్టుకు నిమ్మగడ్డ