ఏపీలో చనిపోతే 5 లక్షలు.. ప్రైవేటు ఆస్పత్రులపై 11 కోట్ల ఫైన్

కరోనా కల్లోలంలో సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపం అవుతున్నాయి. మానవత్వం చూపాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు రోగులను పీక్కుతింటున్నాయి.ఇల్లు వాకిలి అమ్ముకొని మరీ ఆస్పత్రుల బిల్లులు కడుతున్న దైన్యం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రజలను పీడిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సీఎం జగన్ కొరఢా ఝలిపించారు. తాజాగా ఏపీలో కోవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పతులపై విజిలెన్స్ దాడులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు జరిమానా విధించినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. ఇటీవల […]

Written By: NARESH, Updated On : June 9, 2021 5:39 pm
Follow us on

కరోనా కల్లోలంలో సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపం అవుతున్నాయి. మానవత్వం చూపాల్సిన ప్రైవేటు ఆస్పత్రులు రోగులను పీక్కుతింటున్నాయి.ఇల్లు వాకిలి అమ్ముకొని మరీ ఆస్పత్రుల బిల్లులు కడుతున్న దైన్యం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రజలను పీడిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సీఎం జగన్ కొరఢా ఝలిపించారు.

తాజాగా ఏపీలో కోవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ఆస్పతులపై విజిలెన్స్ దాడులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 72 కేసుల్లో వివిధ ప్రైవేటు ఆస్పత్రులకు జరిమానా విధించినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. ఇటీవల చేసినదాడుల్లో రూ.11.30 కోట్ల మేర ప్రైవేటు ఆస్పత్రుల నుంచి జరిమానా వసూలు చేశారు. మొత్తం 94 ఫిర్యాదుల్లో 72 ఫిర్యాదులు ఆస్పత్రుల్లో అవకతవకవలపై వచ్చాయి. ఫీజు కంటే అధికంగా చార్జీలు వసూలు చేసిన వారి నుంచి డబ్బులు రికవరీ చేయించారు. 22 ఆస్పత్రులపై కేసులు పెట్టారు.

అత్యధికంగా గుంటూరు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రూ.4.53 కోట్ల మేర జరిమానా వసూలు చేసినట్లు స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రులతోపాటు తాత్కాలిక అనుమతి పొందిన ఆస్పత్రులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని ఈ భారీ జరిమానాలు, చర్యలతో ఏపీ సర్కార్ స్పష్టం చేస్తోంది.

-కుటుంబంలో సంపాదించే పెద్ద చనిపోతే రూ.5 లక్షలు
ఏపీ సీఎం జగన్ మరోసారి మానవీయత చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబాల్లో ఎవరైనా సంపాదించే వ్యక్తి చనిపోతే అలాంటి కుటుంబానికి ప్రభుత్వమే నేరుగా రూ.5 లక్షలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సమీక్షించిన జగన్.. ఈ బీమా పథకంలో బీమా సంస్థలు క్లెయిమ్ లు ఇవ్వడం లేదని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయించారు. కుటుంబంలో 18-70 ఏళ్లు ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

గతంలో చంద్రన్న బీమా పేరుతో గత సీఎం చంద్రబాబు దీన్ని అమలు చేశారు. నాడు బీమా సొమ్ముగా కోట్ల రూపాయలు ఎల్ఐసీకి చెల్లించారు. దీంతో చనిపోగానే రూ.5వేలు.. ఆతర్వాత 5 లక్షలు బాధిత కుటుంబానికి చెందేవి. జగన్ వచ్చాక ‘చంద్రన్న బీమా రద్దు చేసి వైఎస్ఆర్ బీమా పెట్టారు. కానీ బీమా సంస్థలకు సరిగ్గా ప్రీమియం చెల్లించకపోవడం.. ఇతర కారణాలతో క్లెయిమ్ లు కాక బాధితులకు డబ్బులు అందడం లేదు. దీంతో ప్రభుత్వమే బాధితులకు నేరుగా 5 లక్షలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.