Homeఎంటర్టైన్మెంట్'కత్రినా'తో డేటింగ్ నిజమే: స్టార్ హీరో కొడుకు

‘కత్రినా’తో డేటింగ్ నిజమే: స్టార్ హీరో కొడుకు

Katrina Kaif Vicky Kaushal‘కత్రినా కైఫ్’లోనే మంచి కైపు ఉంది. అయితే, ఈ ముదురు భామకు యాక్టింగ్ మాత్రం రాదు, కానీ ఆమెలో కావాల్సినంత గ్లామర్ ఉంది, ముఖ్యంగా దర్శకనిర్మాతలు అడిగినంత ఎక్స్ పోజింగ్ చేయగలదు. పైగా అసలు పక్కా కమర్షియల్ హీరోయిన్. దేనికి మొహమాట పడదు. అన్నిటికి మించి హీరోలతో అత్యంత సన్నిహితంగా ఉంటుంది. గతంలో చాలా ఏళ్ళు పాటు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ వ్యవహారం గడిపింది.

సల్మాన్ ఖాన్ ను ఒక్క సంవత్సరమే భరించలేరు అనే టాక్ ఉంది. అయినా, కత్రినా పాపం దాదాపు దశాబ్దం పాటు సల్మాన్ వైవిధ్యాన్ని, అతనిలోని రకరకాల విభిన్నత్వాలను ఓపికగా భరించింది. అంతలో అనుకోకుండా ఓ సినిమా నైట్ షూట్ కారణంగా కత్రినా జీవితంలోకి రణబీర్ కపూర్ ప్రవేశించాడు. దాంతో సల్మాన్ తో సాగిస్తున్న సుదీర్థ ప్రేమకు కత్రినా ఫుల్ స్టాప్ పెట్టింది.

నిజానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎన్నోసార్లు కామా లేని బూతులు తినాల్సి వచ్చింది. మరెన్నో అవమానాలు కూడా భరించాల్సి వచ్చింది. సల్మాన్ ప్రేమను తట్టుకొని నిలబడటం కూడా అంత తేలిక అయిన విషయం కాదు. కానీ, కత్రినాకి ‘రణబీర్ కపూర్’ లాంటి స్టార్ హీరో అండ దొరకడంతో మొత్తానికి అమ్మడు కెరీర్ కి ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు.

ఇక అప్పటినుండి రణబీర్ కపూర్ ను కత్రిన కైఫ్ నాలుగేళ్ళ పాటు సీరియస్ గా తెగ ప్రేమించేసింది. ఆమె ప్రేమలో మునిగి మునిగి విసిగిపోయిన రణబీర్, ఆమెకు సైలెంట్ గా బ్రేకప్ చెప్పేశాడు. ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రచారం కాదు, పక్కా వాస్తవం అంటూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు విక్కీ మిత్రుడు హర్షవర్ధన్ కపూర్.

ఇతను కూడా హీరోనే, పైగా స్టార్ హీరో అనిల్ కపూర్ కుమారుడు. ఒక టీవీ టాక్ షోలో విక్కీ, కత్రిన డేటింగ్ అనేది 100 పర్సెంట్ నిజమని హర్షవర్ధన్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఈ కుర్రాడు తన పబ్లిసిటీ కోసం ‘కత్రినా – విక్కీ’ పరువు తీశాడు అన్నమాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version