Bank Holidays: మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా.. అయితే ఈరోజే వెళ్లి చేసేసుకోండి. ఎందుకంటే వరుసగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. అసలే ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కాబట్టి.. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఇక కంపెనీలు, ఇతర సంస్థలు నడిపేవారికి అయితే బ్యాంకులతోనే ఇప్పుడు పని ఉంటుంది.
కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ ఒక్క రోజే అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి. గతంలో కూడా ఇలా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. ఏ శాఖకు సెలవులు వచ్చినా పెద్దగా సీరియస్ గా తీసుకోం కానీ.. బ్యాంకులకు వస్తే మాత్రం ముందు నుంచే అలెర్టె చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో లావాదేవీలతోనే పని కదా.
Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజకీయాల కంటే హీరోయిన్లు ఎక్కువయ్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?
అయితే ఈ ఆ సారి మాత్రం వరుసగా సెలవులు వస్తున్నాయి. మొన్ననే రెండు రోజులు సమ్మెలో పాల్గొన్నాయి ప్రభుత్వ బ్యాంకులు. ఇక నిన్న, ఈరోజు మాత్రమే తెరుచుకున్నాయి. మళ్లీ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి సెలవులు ఉన్నాయి. 1వ తేదీన యాన్యువల్ క్లోజింగ్ డే. ఈ రోజు దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
ఇక ఏప్రిల్ 2న ఉగాది పండుగ. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బ్యాంకులు ఉండవు. ఏప్రిల్ 3న ఆదివారం. ఆ రోజు ఎలాగూ బ్యాంకులకు సెలవే. 4న మాత్రం సర్హూల్ ఉంది. ఆరోజు రాంచిలో మాత్రమే బ్యాంకులకు సెలవు. ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఉంటాయి. మళ్లీ 5వ తేదీన మాత్రం జగ్జీవన్ రామ్ జయంతి ఉంది. ఆరోజు తెలంగాణలో బ్యాంకులు ఉండవు. కాబట్టి ఈరోజు తప్పితే మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ పని ఉన్నా.. ఈ రోజే చేసుకోండి.
Also Read: Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?