Parliament : 1947 నుంచి 1950 జనవరి 25 వరకు మన దేశానికి సొంత రాజ్యాంగం అంటూ లేదు. అయితే మన దేశానికి అద్భుతమైన రాజ్యాంగం ఉండాలని బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో సభ్యులు తీవ్ర మదనం చేశారు. వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఆ తర్వాత మన దేశ ప్రజల అభ్యున్నతికి, అవసరాలకు, అభివృద్ధికి, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి అనేక చర్చలు జరిగిన తర్వాత.. తీవ్రమైన మదనం చోటు చేసుకున్న తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందువల్లే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఒక దేశానికి సంబంధించి రెండు రకాలుగా వేడుకలు జరుపుకోవడం భారత్ కు మాత్రమే చెల్లింది. అందువల్లే మన దేశాన్ని ప్రజాస్వామ్య పట్టుగొమ్మ అని పిలుస్తుంటారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛ పరిహారానికి గురవుతున్న వేళ.. మన దేశం ప్రపంచ దేశాలకే ఒక దారి చూపింది. వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో.. హక్కుల విషయంలో.. స్వీయ పరిపాలన విషయంలో సరికొత్త ఘనతలను అందుకుంది. అందువల్లే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ విలసిల్లుతోంది. మన దేశానికి ఆత్మ రాజ్యాంగం అయితే.. దానిని తుదికంటా అమలు చేసే వ్యవస్థగా పార్లమెంటు ఉంది. శాసనాలు, బిల్లులు, కీలకమైన చట్టాలు పార్లమెంట్ లోనే రూపొందుతుంటాయి. ఇక్కడ సభ్యులు తీర్మానం చేసిన తర్వాత.. తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తుంటారు. అందువల్లే పార్లమెంట్ భారతదేశానికి శాసన చిహ్నంగా ఉంది.
అది మాత్రం కనిపించదు
100 కోట్ల పైచిలుకు జనాభా.. 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల కలబోతగా ఉన్న భారత దేశంలో 545 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటు ఎన్నికలు జరుగుతుంటాయి. ఇందులో సాధించిన మెజారిటీ ఆధారంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అయితే మన దేశంలో 545 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ..420 సీట్ అనేది కనిపించదు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ (పాతది) ప్రకారం 420 అనేది చట్ట వ్యతిరేకులకు విధించే శిక్షకు ఏర్పాటు చేసిన సెక్షన్. అందుకే పార్లమెంట్ సభ్యులు 420 నంబర్ గల సీట్లో కూర్చోడానికి ప్రారంభంలో ఒప్పుకోలేదు. దీంతో పార్లమెంట్లో 419 ఏ, 419 బీ పేరుతో సీట్లను ఏర్పాటు చేశారు. చట్టసభ సభ్యులకు వీటిని రూపొందించారు. అందువల్లే పార్లమెంట్లో 420 నెంబర్ గల సీటు కనిపించదు. అందువల్లే 420 నెంబర్ సీటును పార్లమెంట్ లో మిస్టరీ సీట్ అని పిలుస్తుంటారు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఈ ఏడాది నుంచి భారతీయ న్యాయ సంహిత అనేది వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొత్త రూపు కల్పించింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే పదాన్ని వాడుతున్నారు. గతంలో ఉన్న సెక్షన్లను పూర్తిగా మార్చి.. కొత్త సెక్షన్లను ఏర్పాటు చేశారు.
View this post on Instagram