Homeజాతీయ వార్తలుPM Modi: హ్యాట్రిక్‌పై బీజేపీ గురి.. 400 రోజుల ప్రణాళిక!

PM Modi: హ్యాట్రిక్‌పై బీజేపీ గురి.. 400 రోజుల ప్రణాళిక!

PM Modi: దేశంలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికలకు మరో ఏడాది మిగిలి ఉండగానే హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. ఈమేరకు టార్గెట్‌ 400 డేస్‌ పేరుతో సుధీర్ఘ ప్రణాళిక, రాజకీయం వ్యూహం, విధివిధానాలను రూపొందించుకుంది. బీజేపీని కేంద్రంలో గద్దె దించాలని కేసీఆర్‌ నేత్రుత్వంలోని బీఆర్‌ఎస్‌ ఒకవైపు సన్నద్ధమవుతుంటే.. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలని బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాల్లో వ్యూహ చరన చేస్తోంది. ఒకరు పడగొట్టాలని చూస్తుంటే.. మరొకరు నిలెబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు ఒకే రోజు మొదలు కావడం కాకతాళీయమే.. కానీ, రెండు లక్ష్యాల వెనుక ఉన్నది మాత్రం నరేంద్రమోదీనే.

PM Modi
PM Modi

సరికొత్త ఆయుధాల కోసం వేట..
బీజేపీ కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉంది. దీంతో సహజంగానే ప్రజల్లోల కొతమేర వ్యతిరేకత ఉంటుంది. 2014లో వాడిన ఆయుధాలు, 2018లో పనిచేయవని బీజేపీ సరికొత్త అస్త్రాలు రూపొందించుకుంది. తాజాగా, 2024 కోసం మరిని అస్త్రాల కోసం వ్యూహ రచన చేస్తోంది. ఈమేరకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించారు. ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 400 రోజుల టార్గెట్‌ పార్టీ శ్రేణులకు విధించారు. ఇందుకోసం చతుర్ముఖ వ్యూహాన్ని ప్రతిపాదించారు.

మోదీ బలం.. ఆర్థిక విధానాలు బలహీనత..
బీజేపీకి మోదీ ఎంతో బలం.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి.. 9 ఏళ్లుపాటు ప్రధానికిగా ఉన్నా ఆయనపై వ్యతిరేకత లేదు. బలమైన నేతగానే ఉన్నారు. అదే సమయంలో కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారాయి. పేద, మధ్య తరగతి ప్రజల్లో బీజేపీ ఆర్థిక విధానాలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పెరుగుతున్న ధరల భారం ఎక్కువగా పడేది ఈ రెండు వర్గాలపైనే. దీనిపై గతంలో అనేక సర్వే సంస్థలు కూడా కేంద్రానికి నివేదించాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితిలో ప్రధాని మోదీ తన చతుర్ముఖ వ్యూహంలో మొదటి ప్రాధాన్యత అత్యంత వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 112 జిల్లాలను గుర్తించి అక్కడ అమలవుతున్న కేంద్ర పథకాలు, ప్రజలకు అందుతున్న ఫలాలు తెలుసుకోవాలని సూచించారు. పథకాలు అందని వారికి అందేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఎంపిక చేసిన 112 జిల్లాల్లో కేంద్రం అమలు చేస్తున్న ప్రతీ పథకం అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లొచ్చన భావన మోదీ మాటల్లో కనిపించింది. ఇదే సమయంలో ధరలపై ఉన్న వ్యతిరేకతను అధిగమించొచ్చని మోదీ సూచించినట్లు తెలిసింది.

అణగారిన కులాలు, వర్గాలకు చేరువ కావాలి..
ఇక బీజేపీ 400 డేస్‌ టార్గెట్‌లో మోదీ ప్రతిపాదించిన రెండో వ్యూహం అణగారిన వర్గాలు, కులాలకు బీజేపీ చేరువ కావడం. ఇందులో మైనారిటీలు కూడా ఉన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికీ బీజేపీకి సరైన గుర్తింపు లేదు. అగ్రవర్ణ పార్టీగానే చాలామంది బీజేపీని భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని అణగారిన వర్గాలు, కులాలు, మతాలకు దగ్గర చేయాలని మోదీ సూచించారు. ఇందులో మెనుకబడిన ముస్లింలకు అంత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పేర్కొన్నారు. ముస్లింలలో మహిళలకు పార్టీని మరింత చేరువ చేయాలని ప్రతిపాదించారు. అదే వర్గంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

యువతే టార్గెట్‌..
ఇక మూడో వ్యూహం యువత, కొత్త ఓటర్లు. వీరిని మరింత ఆకర్షించేలా వ్యూహం రూపొందించాలని మోదీ సూచించారు. ఈ వర్గాల ప్రభావం ఎన్నికలపై ఎక్కువగా ఉంటుందని, కమ్యూనికేషన్, పార్టీ గురించి ఎక్కువ ప్రచారం చేయడం తదితర అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. ఇందుకు సోషల్‌ మీడియాను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలని తెలిపారు. కొత్త ఓటర్లకు బీజేపీని చేరువ చేయాలని సూచించారు. యువతే పార్టీకి వచ్చే ఎన్నికల్లో బలం కావాలని మోదీ స్పష్టంగా తెలిపారు.

PM Modi
PM Modi

నాలుగో అస్త్రం మోదీనే..
400 డేస్‌ ప్టాన్‌లో బీజేపీ నాలుగో అస్త్రం ప్రధాని మోదీనే. ఈ విషయాన్ని ప్రధాని చెప్పకపోయినా కమలనాథుల్లో ఉన్న భావన అదే. 2014 ఎన్నికల్లో మోదీని బీజేపీ హిందు సింబల్‌గా చూపింది. 2018 ఎన్నికల సమయంలో మోదీని ఫైటర్‌గా చిత్రీకరించారు. మోదీ ప్రధానిగా ఉంటేనే దేశానికి రక్షణ ఉంటుందన్న భావన ప్రజాల్లో తీసుయొచ్చారు. ఇక 2024 నాటికి మోదీని విశ్వగురువుగా చూపే ప్రయత్నం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ ఏడాది జీ20 దేశాల సమావేశం భారత్‌లో జరుగనున్న నేపథ్యంలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని మోదీని ప్రపంచస్థాయి నేతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

మొత్తంగా 400 రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతున్న బీజేపీ మూడోసారి దేశంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతను చీల్చే ప్రయాత్నాలు చేస్తుంది. విపక్షాల అనైక్యతను తమకు అనుకూలంగా మార్చుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular