Husband And Wife Relationship: రెండు శరీరాలను ఒకటి చేసేది శృంగారం. రెండు జంటలను ఏకం చేస్తుంది. రెండు మనసులను కలుపుతుంది. ఇలా శృంగారంతో మనకు ఎన్నో లాభాలున్నాయి. అందుకే శృంగారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే చిక్కుల్లో పడతాం. ఎన్నో వ్యాధులకు దగ్గరవుతాం. ఇలా శృంగారాన్ని ఆస్వాదించడంలో భార్యాభర్తలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దాంపత్య జీవితంలో శృంగారమే ప్రధానం. ఆలుమగల మధ్య కూడా ఇదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. శృంగారం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

శృంగారం కూడా వ్యాయామం లాంటిదే. దీన్ని చాలా మంది ఒప్పుకుంటారు. శృంగారంలో కూడా కదలికలు వ్యాయామం చేసినట్లే ఉంటాయి. అందుకే దీన్ని వ్యాయామంగా అభివర్ణిస్తుంటారు. శృంగారం చేస్తే కూడా వ్యాయామం చేసినంత కేలరీల శక్తి కరుగుతుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడల్లా 150 కేలరీల శక్తి కరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. శృంగారం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
శృంగారం కారణంగా శరీరంలో ఆక్సిటోనిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై మనకు సంతోషం కలిగేలా చేస్తాయి. నొప్పులను తగ్గించి మంచి నిద్ర రావడానికి కారణమవుతుంది. ఇలా శృంగారంతో మనకు ఎన్నో లాభాలు దాగి ఉన్నాయి. వారంలో రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువవుతంది. యాంటీ బాడీస్ ఎక్కువగా తయారవుతాయి. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. మన శరీరం 30 శాతం అదనపు రక్షణ పెరుగుతుంది.

శృంగారంలో యాక్టివ్ గా ఉండేవారు యవ్వనంలా కనిపిస్తారు. దీని వల్ల శరీరంలో డి విటమిన్ విడుదలవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. శారీరక, మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారికి రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్య తీరుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ అవకాశాలుంటాయి. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ఇలా శృంగారం వల్ల మనకు ఎన్నో బాధలు దూరమవుతాయని చెబుతున్నారు.